
📌 Key Points
- డివిజనల్ ఇంజినీర్ పరిమితి రూ. 2 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంపు.
- సూపరింటెండెంట్ ఇంజనీర్ పరిమితి రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంపు.
- చీఫ్ ఇంజినీర్ పరిమితి రూ. 10 లక్షల నుండి రూ. 50 లక్షల వరకు పెంపు.
- 80% పనులు ఇకపై ఎస్ఈ (SE) పరిధిలోనే పూర్తి, జాప్యం నివారణ.
తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ శుభవార్త ప్రకటించింది. క్షేత్రస్థాయి అధికారులకు పనుల మంజూరు పరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై చిన్న పనుల కోసం ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, స్థానిక స్థాయిలోనే వేగంగా అనుమతులు లభిస్తాయి.
అధికార పరిమితుల పెంపు: ఎవరికి ఎంత?
TGSPDCL Services : టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది. క్షేత్రస్థాయిలో చేపట్టే చిన్న చిన్న పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విద్యుత్ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
డివిజనల్ ఇంజినీర్ (DE), సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE), చీఫ్ ఇంజనీర్ (CE)లకు పనుల మంజూరు అధికార పరిమితిని పెంచుతూ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ (గతంలో జీతేష్ వి పాటిల్ సమీక్షించిన ప్రతిపాదనల మేరకు) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు నాణ్యమైన సేవలు మరింత వేగంగా అందనున్నాయి.
వినియోగదారులకు ప్రయోజనాలు: వేగం, పారదర్శకత
గతంలో డివిజన్ స్థాయిలో పనుల మంజూరు పరిమితి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఉండేది. దీనిని ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షలకు పెంచారు. అంతేకాకుండా…. సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, చీఫ్ ఇంజినీర్ (CE) పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెంచారు. ఈ నిధుల పెంపుతో ఎస్టిమేషన్ల మంజూరు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు, ఇతర సాంకేతిక పనులు వేగంగా పూర్తవుతాయి. సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి రావాల్సిన తిప్పలు వినియోగదారులకు తప్పనున్నాయి.
గతంలో చిన్న పనుల మంజూరుకైనా ఉన్నతాధికారుల అనుమతి కోసం ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండేవి. నిధులు ఉన్నా సాంకేతిక అనుమతుల పరిమితి తక్కువగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పనులు ఆలస్యమయ్యేవి. కానీ తాజా నిర్ణయంతో 80 శాతం పనులు ఎస్ఈ (SE) పరిధిలోనే ముగిసిపోతాయి. 11 కేవీ సర్వీసుల ఎస్టిమేషన్లు, అగ్రిమెంట్లు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులన్నీ జోన్ స్థాయిలోనే పూర్తవుతాయి.
స్థానిక స్థాయిలోనే పనులు: జాప్యానికి చెక్
సివిల్ పనుల్లో సైతం ఎస్టిమేషన్ల పరిమితిని పెంచడం వల్ల వినియోగదారులకు సమయం ఆదా అవ్వడంతో పాటు సంస్థలో పారదర్శకత పెరుగుతుందని కాంట్రాక్టర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరల రిత్యా అంచనా వ్యయం పెరిగినా…. స్థానిక అధికారులకే అధికారాలు ఉండటం వల్ల పనుల్లో జాప్యం పూర్తిగా తొలగిపోనున్నాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఈ నిర్ణయం విద్యుత్ పనుల్లో జాప్యాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచుతుంది. వినియోగదారులకు నాణ్యమైన, వేగవంతమైన సేవలను అందించడంలో టీజీఎస్పీడీసీఎల్ కీలక ముందడుగు వేసింది. ఇది ప్రజలకు నిజమైన ఊరట.


