
📌 Key Points
- AP TET 2026 దరఖాస్తులు జూన్ 5 నుంచి జూలై 5 వరకు స్వీకరణ.
- ఆగస్టు 5-21 వరకు ఆన్‌లైన్‌లో టెట్ పరీక్షలు, సెప్టెంబర్ 15న ఫలితాలు.
- అక్టోబరులో డీఎస్సీ 2026 నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.
- ‘జాబ్ క్యాలెండర్’లో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ టెట్ 2026 షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు, అక్టోబరులో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇది నిరుద్యోగుల ఆశలను రెకెత్తించింది.
ఏపీ టెట్ 2026 షెడ్యూల్ వివరాలు
AP TET 2026 Notification : ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. తాజాగా ఏపీ టెట్ (AP TET – 2026) షెడ్యూల్ ను విడుదల చేసింది. విద్యాశాఖ అధికారికంగా ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులతో పాటు, ఇప్పటికే విధుల్లో ఉంటూ అర్హత సాధించాలనుకునే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్ష ఎంతో కీలకం కానుంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్న వివరాల ప్రకారం… జూన్ 5వ తేదీ నుంచే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు జూలై 5 వరకు నెల రోజుల పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 25వ తేదీ నుంచి హాల్ టికెట్లను జారీ చేస్తారు.
డీఎస్సీ 2026: అక్టోబరులో మెగా నోటిఫికేషన్
ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాల పరిశీలన పూర్తి చేసి, సెప్టెంబర్ 15వ తేదీన తుది ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, సిలబస్, ఫీజుల వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in ను సందర్శించాల్సి ఉంటుంది.
టెట్ నోటిఫికేషన్‌తో పాటు ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం మరో శుభవార్తను కూడా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘జాబ్ క్యాలెండర్’లో భాగంగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో డీఎస్సీ (DSC-2026) నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయనుంది.
నిరుద్యోగులకు నారా లోకేశ్ సందేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ మెగా డీఎస్సీని నిర్వహించనున్నారు. టెట్ ఫలితాలు సెప్టెంబర్‌లో వచ్చిన వెంటనే అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ రానుండటంతో అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం మంచి సమయం దొరకనుంది. ఏపీ టెట్ -2026కు సిద్ధమవుతున్న కాబోయే ఉపాధ్యాయులకు, ఇన్-సర్వీస్ ఎడ్యుకేటర్లకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల విడుదల నిరుద్యోగులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం ప్రకటించిన ‘జాబ్ క్యాలెండర్’లో భాగంగా ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని ఆశిస్తున్నారు. అభ్యర్థులు సన్నద్ధతకు సిద్ధం కావాలి.


