|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aparna Balamurali: అందరిముందు అలా అన్నాడు.. ఒక్కమాట మాట్లాడకుండా వెంటనే..

Published: 16-09-2025, 11:49 AM
Aparna Balamurali: అందరిముందు అలా అన్నాడు.. ఒక్కమాట మాట్లాడకుండా వెంటనే..

ప్రముఖ మలయాళ నటి అపర్ణ బాలమురళి తాజా ఇంటర్వ్యూలో తనకు ఎదురైన బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడింది. విమానాశ్రయంలో జరిగిన ఒక ఘటనను వివరిస్తూ, తన అనుభవాలను పంచుకుంది. ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందో తెలుసుకుందాం.

Key Points

1

అపర్ణ బాలమురళి బాడీ షేమింగ్‌ గురించి మాట్లాడింది.

2

విమానాశ్రయంలో ఆమెను ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని వివరించింది.

4

ఇప్పుడు ఆమె బాడీ షేమింగ్‌ కామెంట్లను పట్టించుకోదని తెలిపింది.

బాడీ షేమింగ్‌ అనుభవం

సన్నగా ఉంటే అస్థి పంజరంలా ఉన్నావని, బొద్దుగా ఉంటే బాగా లావైపోయావని ఏదో ఒకరకంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. తనను కూడా ఇలాంటి కామెంట్లతో బాడీ షేమింగ్‌ చేశారంటోంది మలయాళ హీరోయిన్‌ అపర్ణ బాలమురళి ( Aparna Balamurali ). తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొందరు అదే పనిగా ఏదేదో వాగుతారు. ఏం చేస్తున్నావ్‌? ఇలా అయిపోతున్నావ్‌? అని కామెంట్లు చేస్తుంటారు.

లెక్క చేయట్లే మొదట్లో ఫీలయ్యేదాన్ని. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. కానీ ఇప్పుడవేవీ పట్టించుకోవడం లేదు. ఇలా ధృడంగా మారడానికి నాకు చాలా సమయం పట్టింది. ఒకసారేమైందంటే.. చాలాదూరం ప్రయాణించి విమానాశ్రయంలో దిగాను. ఇంతలో సడన్‌గా నాకు పరిచయమే లేని వ్యక్తి ఎదురొచ్చి.. ఏంటి? ఇంత లావైపోయావ్‌? అన్నాడు.

విమానాశ్రయ సంఘటన

షాకయ్యా అందరి ముందు సడన్‌గా అలా అనేసరికి షాకయ్యాను. తర్వాత ఒక్కమాట కూడా మాట్లాడకుండా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయాను. ఇలాంటివి జరిగినప్పుడు మనసుకు కష్టంగా అనిపించేది. కానీ, ఒకానొక సమయంలో ఈ బాధను అధిగమించాను. ఇప్పుడలాంటి కామెంట్లను పట్టించుకోవడమే మానేశాను అని చెప్పుకొచ్చింది.

సినిమా అపర్ణ బాలమురళి 2015లో ఒరు సెకండ్‌ క్లాస్‌ యాత్ర అనే మలయాళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) సినిమాతో విశేషమైన ఆదరణ సంపాదించుకుంది. మలయాళంలో సండే హాలీడే, 2018, ధూమం, రుధిరం వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 8 తొట్టకాల్‌, వీట్ల విశేషం, రాయన్‌ సినిమాలు చేసింది. ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాలు చేస్తోంది.

ఆత్మవిశ్వాసం పెంచుకోవడం

అపర్ణ బాలమురళి తన అనుభవాలను పంచుకోవడం ద్వారా, బాడీ షేమింగ్‌ సమస్యపై అవగాహన పెంచడానికి ప్రయత్నించింది. తన ఆత్మవిశ్వాసంతో, ఇతరుల విమర్శలను లెక్క చేయకుండా జీవించడానికి ప్రోత్సహించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.