
📌 Key Points
- విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రోపై రూ. 8,000+ తగ్గింపును అందిస్తోంది.
- ఈ ఫోన్ ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
- ఐఫోన్ 17 ప్రో 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- సింగిల్ ఛార్జ్‌పై 39 గంటల వీడియో ప్లేబ్యాక్ ఉంటుంది.
కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 8,000 కన్నా ఎక్కువ తగ్గింపుతో, ఇది ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేయడానికి మంచి అవకాశం.
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో డీల్స్
Apple iPhone 17 Pro : ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలా? ఇదే బెస్ట్ టైమ్. విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రోపై రూ. 8,000 కన్నా ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ మీకోసమే..
Apple iPhone 17 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ మీకోసమే. ప్రముఖ రిటైలర్ విజయ్ సేల్స్ ఐఫోన్ 17 ప్రోపై రూ. 8,000 కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది.
2025 సెప్టెంబర్‌లో రూ. 134,900కి లాంచ్ అయిన ఈ ఐఫోన్‌లో ఆపిల్ A19 ప్రో చిప్, ట్రిపుల్ 48MP ఫ్యూజన్ కెమెరా సిస్టమ్, 8K వీడియో రికార్డింగ్ ఉన్నాయి. ఈ డీల్ బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో డీల్స్ : విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 17 ప్రో ధర ప్రస్తుతం రూ. 1,32,490గా ఉంది. లాంచ్ ధర నుంచి నేరుగా రూ. 2,410 తగ్గింపు పొందవచ్చు. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐలపై అదనంగా రూ. 6,000 తగ్గింపు పొందవచ్చు. మొత్తం ధర రూ. 8,410 కన్నా ఎక్కువగా ఉంటుంది. విజయ్ సేల్స్ ట్రేడ్-ఇన్ ఆప్షన్ కూడా అందిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, కెమెరా, కలర్ ఆప్షన్లు : ఈ ఐఫోన్ 17 ప్రో A19 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో 6.3-అంగుళాల OLED డిస్ ప్లే, ఆల్వేజ్ ఆన్ డిస్ ప్లే, యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఐఫోన్ సింగిల్ ఛార్జ్‌పై 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
Read Also : Small Currency Notes : అమ్మయ్యా.. ఇక చిల్లర కష్టాలు తీరినట్టే.. ATMలో రూ. 10, రూ.20, రూ. 50 నోట్లు.. ఎప్పటినుంచంటే?
ఇప్పుడు కొనాలా? వద్దా?
ఐఫోన్ 17 ప్రో రియర్ సైడ్ ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 48MP అల్ట్రావైడ్, 8x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. మూడు 48MP లెన్స్‌లతో ఫోన్ ఫొటో, వీడియో షూటింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది.
8K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. వీడియో రిజల్యూషన్ పరంగా ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్‌ల కన్నా టాప్ ప్లేసులో నిలుస్తుంది. ఫ్రంట్ సైడ్ వీడియో కాల్స్, పోర్ట్రెయిట్‌ల కోసం 18MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఐఫోన్ 17 ప్రో సిల్వర్, కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఇప్పుడు కొనాలా? వద్దా? : ఐఫోన్ 18 ప్రో సిరీస్ సెప్టెంబర్ 2026 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో కొనడమంటే పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారీ తగ్గింపుతో పొందినట్లే. A19 ప్రో చిప్, ట్రిపుల్ కెమెరా సెటప్, 8K రికార్డింగ్ ఆప్షన్లు ఉన్నాయి. మీ పాత ఫోన్‌తో ఎక్స్ఛేంజ్ చేస్తే ఈ ఐఫోన్ 17 ప్రో డీల్ బెటర్.
ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ ముగిసేలోపు కొనుగోలు చేయడం మంచిది. లేదంటే ఈ అవకాశం మళ్ళీ రాకపోవచ్చు.


