|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: జెంటిల్‌మెన్ సినిమాను వదులుకోవాలనుకున్న అర్జున్! అసలేం జరిగిందంటే?

Published: 17-02-2026, 2:05 AM
షాకింగ్: జెంటిల్‌మెన్ సినిమాను వదులుకోవాలనుకున్న అర్జున్! అసలేం జరిగిందంటే?
  • యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌ను మార్చిన జెంటిల్‌మెన్ చిత్రం!
  • సినిమాలు వదిలేద్దామనుకున్న అర్జున్‌కు శంకర్ కథతో బ్రేక్!
  • కొత్త దర్శకుడు శంకర్ నమ్మకంతో అర్జున్‌ను ఒప్పించారు.
  • జెంటిల్‌మెన్ చిత్రం భారీ విజయం, అర్జున్‌కు ప్రత్యేక గుర్తింపు!

యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌లో జెంటిల్‌మెన్ సినిమా ఒక సంచలనం. ఈ సినిమాను వదులుకోవాలనుకున్న అర్జున్ మనసు మార్చుకోవడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అర్జున్ కెరీర్‌ను మార్చిన సినిమా ఏది?

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి చాలా విజయాలను సొంతం చేసుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ లో నటించిన ఈ నటుడు ఈ మధ్యకాలంలో కీలక, ముఖ్య, విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అర్జున్ తాజాగా సీతా పయనం అనే చిత్రంలో నటించి దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

శంకర్ ఎలా అర్జున్‌ను ఒప్పించారు?

నిరంజన్ సుధీంద్ర, ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండడంతో అర్జున్ ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రమోషన్లను చేస్తున్నాడు. తాజాగా ఓ ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ తనకు అద్భుతమైన విజయాన్ని, గుర్తింపును తీసుకువచ్చిన జెంటిల్‌మెన్‌ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

జెంటిల్‌మెన్ వెనుక అసలు కథేంటి?

తాజాగా అర్జున్ మాట్లాడుతూ… ఒకానొక సమయంలో నేను సినిమాలే వదిలేద్దాం అనుకున్నాను. అలాంటి సమయంలో నా దగ్గరికి శంకర్ ‘జెంటిల్‌మెన్‌’ కథతో వచ్చాడు. నాకు ఆ టైంలో సినిమా చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. ఆయన కొత్త దర్శకుడు, నన్ను బ్రతిమిలాడి కథ వినండి సార్, విన్నాక నచ్చకపోతే రిజెక్ట్ చేయండి అన్నారు. నేను కూడా కథ విందాం, ఆ తర్వాత రిజెక్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఆయన కథ చెప్పడం మొదలు పెట్టాడు. స్టోరీ మొత్తం పూర్తయింది, నాకు అది అద్భుతంగా నచ్చింది. అలాంటి కథను రిజెక్ట్ చేస్తే ఎలా..? అందుకే నేను ఆ సినిమా చేశాను. అది మంచి విజయం సాధించి, నాకు గుర్తింపును తీసుకువచ్చింది అని అర్జున్ చెప్పుకొచ్చాడు.

జెంటిల్‌మెన్ సినిమా అర్జున్ కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచింది. మరిన్ని ఆసక్తికరమైన టాలీవుడ్ అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.