|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

46 అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు మూవీ – స్పోర్ట్స్ డ్రామాగా అర్జున్ చక్రవర్తి – 16 మిలియన్ల వ్యూస్‌తో టీజర్

Published: 07-08-2025, 10:42 AM
46 అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు మూవీ - స్పోర్ట్స్ డ్రామాగా అర్జున్ చక్రవర్తి - 16 మిలియన్ల వ్యూస్‌తో టీజర్

విజయ్ రామరాజు నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ తెలుగు స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే 46 అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ సినిమా టీజర్‌కు 16 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు.

Key Points

1

46 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘అర్జున్ చక్రవర్తి’

2

16 మిలియన్ల వ్యూస్‌తో టీజర్ సూపర్ హిట్

4

ఆగస్టు 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

అర్జున్ చక్రవర్తి సినిమా విశేషాలు

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన తెలుగు స్పోర్ట్స్ చిత్రం డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే అర్జున్ చక్రవర్తి సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.

ఇటివలే రీలీజైన అర్జున్ చక్రవర్తి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ చక్రవర్తి టీజర్ ఇన్‌స్టాగ్రామ్‌ లో 16 మిలియన్లు వ్యూస్ తెచ్చుకుంది. అలాగే, యూట్యూబ్‌‌ లో 1.5 మిలియన్లు వ్యూస్‌ను క్రాస్ చేసేసింది. దీంతో ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది.

టీజర్‌కు అద్భుతమైన స్పందన

ఈ తరుణంలో తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అర్జున్ చక్రవర్తి సినిమాలోని ఫస్ట్ సింగిల్ మేఘం వర్షించదా సాంగ్‌ను రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ బ్యుటీఫుల్ లవ్ సాంగ్‌గా ఈ మేఘం వర్షించదా పాటను కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి.

కపిల్ కపిలన్, మీరా ప్రకాష్ , సుజిత్ శ్రీధర్ ముగ్గురు సింగర్స్ తమ మ్యాజికల్ వాయిస్‌తో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌లో విజయరామరాజు, సిజా రోజ్ కెమిస్ట్రీ చాలా లవ్లీగా ఉంది. అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాతో పాటు హార్ట్ టచ్చింగ్ లవ్ స్టొరీతో అర్జున్ చక్రవర్తి అలరించబోతుందని ఈ సాంగ్ మేఘం వర్షించదాను చూస్తే తెలుస్తోంది.

మొదటి పాట విడుదల

ఇదిలా ఉంటే, అర్జున్ చక్రవర్తి సినిమాలో విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి, దుర్గేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జగదీష్ చీకాటి డీవోపీ కాగా, ప్రదీప్ నందన్ ఎడిటర్, సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇక అర్జున్ చక్రవర్తి సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు రచన, దర్శకత్వాన్ని విక్రాంత్ రుద్ర అందిస్తున్నారు.

అర్జున్ చక్రవర్తి సినిమా అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా మరియు హృద్యమైన ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 29న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.