
📌 Key Points
- అర్జున్ సర్జా దర్శకత్వంలో ‘సీతా పయనం’ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
- పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని, నమ్మదగిన వ్యక్తి అని అర్జున్ సర్జా అన్నారు.
- పవన్ కళ్యాణ్ అంటే తమ ఇంట్లో అందరికీ అభిమానమని అర్జున్ తెలిపారు.
- రాజకీయ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని అర్జున్ సర్జా వెల్లడించారు.
సినీ నటుడు అర్జున్ సర్జా, పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిజాయితీపరుడని, ఆయన్ని కళ్ళు మూసుకుని నమ్మవచ్చని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ సినిమా ప్రమోషన్లలో ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ సర్జా ఏమన్నారంటే?
Arjun sarja: సినీ నటుడు అర్జున్ సర్జా పరిచయం అవసరం లేని పేరు తెలుగుతోపాటు తమిళ కన్నడ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అర్జున్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన అర్జున్ ప్రస్తుతం దర్శకుడిగా మారిపోయారు. ఈయన దర్శకత్వంలో సీతా పయనం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అర్జున్ సర్జాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల గురించి కూడా ప్రస్తావనకు తీసుకురావడంతో ఈయన హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ సర్జా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, వడర్ ఫుల్ పర్సన్ అంటూ మాట్లాడారు. ఇక తనని మా ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంతో అభిమానిస్తారని హీరోగా మాత్రమే కాకుండా, ఒక లీడర్ గా కూడా పవన్ కళ్యాణ్ అంటే మా అందరికీ చాలా ఇష్టమని తెలిపారు.
‘సీతా పయనం’ సినిమాతో దర్శకుడిగా అర్జున్ సర్జా
ఇప్పటివరకు తాను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను అయితే పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీపరుడని అర్జున్ తెలిపారు. ఏదైనా చేయాలి అనుకుంటే చేసి తీరే పట్టుదల ఉన్న వ్యక్తి పవన్ అని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ ని చూడగానే వీడ్ని నమ్మొచ్చు మనము, పవన్ కళ్యాణ్ ను కళ్ళు మూసుకుని ఫాలో కావచ్చని అంత ఖచ్చితమైన వ్యక్తి అని అర్జున్ తెలిపారు. ఏదైనా పని విషయంలో పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి పొలిటీషియన్ అంటూ అర్జున్ తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో చాలామందికి పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది. ఎంతోమంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా మాత్రమే కాకుండా రాజకీయాల పరంగా కూడా అతనిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక సీతా పయనం సినిమా విషయానికి వస్తే అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించారు. ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతుంది ఇక ఇందులో నిఖిల్ ఐశ్వర్య కు జంటగా నటించారు నిజానికి ఈ సినిమాలో విశ్వక్ సేన్ నటించాల్సి ఉండగా కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన అర్జున్
పవన్ కళ్యాణ్ గురించి అర్జున్ సర్జా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు అర్జున్ సర్జా వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


