|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆషికా రంగనాథ్ డ్రీమ్ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? షాకింగ్ నిజాలు రివీల్!

Published: 02-01-2026, 12:30 AM
ఆషికా రంగనాథ్ డ్రీమ్ బాయ్‌ఫ్రెండ్ ఎవరు? షాకింగ్ నిజాలు రివీల్!
  • ‘నా సామిరంగ’తో హిట్ అందుకుని, రవితేజతో నటిస్తున్న ఆషికా రంగనాథ్.
  • కెరీర్‌ను గౌరవించే, ప్రోత్సహించే భాగస్వామి కావాలని ఆషికా కోరిక.
  • వ్యక్తిత్వం, నిజాయితీ, బాధ్యత, పరిశుభ్రతకు ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
  • కళ్యాణ్ రామ్ ‘హస్గెండ్ మెటీరియల్’ అని ప్రశంసించిన ఆషికా రంగనాథ్.

టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్న నటి ఆషికా రంగనాథ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తన డ్రీమ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలి, పెళ్లి ప్లాన్స్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో ఆషికా రంగనాథ్ కెరీర్ గ్రాఫ్

‘అమిగోస్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది కన్నడ భామ ఆషికా రంగనాథ్(Ashika Ranganath). ఆ తర్వాత వచ్చిన ‘నా సామిరంగ’తో సూపర్ హిట్‌ అందుకుని తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె కెరీర్ పూర్తిగా టర్న్ తీసుకుందని చెప్పాలి. సహజమైన నటన, గ్లామర్‌తో పాటు సంప్రదాయ లుక్‌లోనూ ఆకట్టుకునే ఆషికాకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. వరుసగా ఆఫర్లు రావడంతో టాలీవుడ్‌లో ఆమె బిజీ హీరోయిన్‌గా మారుతోంది. గత ఏడాది ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా, ఆ ప్రభావం ఆమె కెరీర్‌పై పెద్దగా పడలేదు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. ముఖ్యంగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమాలో కీలక పాత్రలో అవకాశం దక్కించుకోవడం విశేషం. ఇందులో రవితేజ సరసన ఆషికా రొమాన్స్ చేయనుండగా, మరో హీరోయిన్‌గా డింపుల్ హయాతీ కూడా నటిస్తోంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషికా రంగనాథ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నన్ను గౌరవించే వ్యక్తి కావాలి, నా కెరీర్‌ను అర్థం చేసుకుని సపోర్ట్ చేసే మనసుండాలి. నటన నా ప్యాషన్.. దాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించే వ్యక్తి అయితే చాలు” అంటూ చెప్పింది. అంతేకాదు, లైఫ్ పార్ట్‌నర్ విషయంలో లుక్స్ కంటే మెంటాలిటీ, నిజాయితీ, బాధ్యత ఎక్కువ ముఖ్యమని స్పష్టం చేసింది.

పెళ్లిపై మనసు విప్పిన ఆషికా

కుటుంబాన్ని విలువలతో చూసే వ్యక్తి కావాలన్న ఆమె మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తన జీవిత భాగస్వామి కేరింగ్‌గా, లవింగ్‌గా తనను చూసుకునే వ్యక్తి కావాలని, చిన్న చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ చూపించే మనసుండాలని చెప్పింది. అంతేకాకుండా భర్త క్లీన్ హ్యాబిట్స్ కలిగి ఉండాలని కూడా చెప్పింది. పరిశుభ్రత విషయంలో రాజీపడనని, వ్యక్తిత్వాన్ని అది చాలా వరకు ప్రతిబింబిస్తుందని అభిప్రాయపడింది. నేను చూసిన వారిలో కళ్యాణ్ రామ్ హస్గెండ్ మెటీరియల్ అని చెప్పింది. ఇప్పట్లో పెళ్లిపై తొందరేమీ లేదని, కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టానని కూడా ఆషికా క్లారిటీ ఇచ్చింది.

బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన రేణు దేశాయ్.. ఒడిలో పసిబిడ్డతో దర్శనమిచ్చి షాకిచ్చిందిగా!

ఆమె కోరుకునే లక్షణాలు, కళ్యాణ్ రామ్ ప్రస్తావన

ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

ఆషికా రంగనాథ్ ప్రస్తుతం కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినా, తన జీవిత భాగస్వామి విషయంలో ఆమెకు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. వ్యక్తిత్వం, కెరీర్‌కు మద్దతు ఇచ్చే నిజాయితీ గల భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.