
📌 Key Points
- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దేత్తడి’ చిత్రం
- మార్చి 24న ‘దేత్తడి’ గ్లింప్స్ విడుదల
- హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే సినిమా
- ఆశిష్ కొత్త లుక్‌తో హైదరాబాదీ యాసలో డైలాగులు
యంగ్ హీరో ఆశిష్ నటిస్తున్న చిత్రం ‘దేత్తడి’. ఈ సినిమా గ్లింప్స్‌ను మార్చి 24న విడుదల చేయనున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య రావు గంగాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండనుంది.
దేత్తడి గ్లింప్స్ విడుదల తేదీ
Dethadi: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దేత్తడి’ (Dethadi). ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఆశిష్ (Ashish), ఇప్పుడు పక్కా మాస్ అండ్ కల్చరల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య రావు గంగాసాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పవర్ ఫుల్ గ్లింప్స్ (Dethadi Glimpse)ను మార్చి 24న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు చేసిన రెండు సినిమాలు ఆశిష్‌కు అన్నకున్నంతగా గుర్తింపును ఇవ్వలేకపోయాయి. అందుకే ఈసారి చాలా వినూత్నంగా ట్రై చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఈ సినిమాపై వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, హైదరాబాద్‌లోని అసలైన సంస్కృతిని, ఇక్కడి జీవనశైలిని వెండితెరపై ఆవిష్కరించబోతోంది. విడుదలైన గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బ్లాక్ అండ్ రెడ్ షేడ్స్‌లో ఆశిష్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే, సినిమాలో రా ఎనర్జీ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. ముఖ్యంగా హీరో వెనుక నుంచి కనిపిస్తూ ఫైర్ బ్రీతింగ్ యాక్ట్ చేస్తున్న విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఇప్పటివరకు టచ్ చేయని కొన్ని విభిన్నమైన కల్చరల్ ఎలిమెంట్స్‌ను ఈ మూవీలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఆశిష్ ఈ చిత్రం కోసం తన లుక్ మార్చడమే కాకుండా, పక్కా హైదరాబాదీ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పబోతుండటం విశేషం.
ఆశిష్ ప్రయత్నం ఫలిస్తుందా?
సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలుపుతున్నారు. జునైద్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ కానుండగా, ప్రముఖ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడమే కాకుండా.. క్రియేటివ్ హెడ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఆశిష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. పాతబస్తీ గల్లీల నుంచి పక్కా లోకల్ ఎమోషన్స్ వరకు అన్నీ మేళవించి వస్తున్న ఈ ‘దేత్తడి’ గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 24న రాబోయే గ్లింప్స్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుందని వారు చెబుతున్నారు.
Get ready to witness Raw Hyderabadi #Dethadi like never before 💥💥 #DethadiGlimpse out on March 24th at 7:02 PM #Dilraju #Shirish @AshishVoffl @adityaraobholte @KumarBezwada @JunaidKumar11 @punnamurali03 @SVC_official pic.twitter.com/8aohQQ259O
హైదరాబాద్ సంస్కృతి వెండితెరపై
— Sri Venkateswara Creations (@SVC_official) March 20, 2026
‘దేత్తడి’ సినిమా హైదరాబాద్ సంస్కృతిని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఆశిష్ కొత్త లుక్‌తో, హైదరాబాదీ యాసలో డైలాగులు చెబుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. గ్లింప్స్ విడుదల కోసం ఎదురుచూద్దాం.


