
📌 Key Points
- ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా AA22 నుండి వీడియో అప్‌డేట్ వస్తుందని అభిమానుల ఆశలు.
- బన్నీ-అట్లీ కాంబోలో మాస్ ఫీస్ట్ ఉంటుందని ఊహించిన ఫ్యాన్స్‌కు పోస్టర్ మాత్రమే విడుదల కానుందనే నిరాశ.
- టీజర్ విడుదల చేయకపోవడంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఇది అభిమానులను అవమానించడమేనని ఆగ్రహం.
- సైన్స్ ఫిక్షన్ సినిమా కావడంతో విజువల్స్ విషయంలో రాజీ పడకూడదని అట్లీ భావిస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా AA22 నుండి ప్రత్యేక వీడియో విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు. అయితే, అట్లీ కేవలం పోస్టర్‌తో సరిపెట్టే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.
బన్నీ బర్త్‌డే అప్‌డేట్ పై భారీ అంచనాలు
AA22 Update: బర్త్ డే లు వస్తున్నాయంటే చాలు తమ హీరోలు సాలిడ్ అప్ డేట్స్ తో ఎంటర్ టైన్ చేస్తారని తెగ మురిసిపోతుంటారు మూవీ లవర్స్.ఇది జనరల్ గా జరిగిదే. ఇక మొన్నటికి మొన్న చరణ్ తన బర్త్ డే సందర్భంగా పెద్ది నుండి పహిల్వాన్ అంటూ క్రేజీ అప్ డేట్ వదిలి ఆడియన్స్ ని మురిపించాడు కూడా. ఇక గత కొన్ని నెలలుగా ఈ ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డేకి AA22 నుంచి ఒక రేంజ్ వీడియో అప్‌డేట్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్.
బన్నీ – అట్లీ కాంబో అంటేనే మాస్ ఫీస్ట్
కానీ వాలకం చూస్తుంటే ఆ రోజు అట్లీ హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. అవును …బన్నీ – అట్లీ కాంబో అంటేనే మాస్ ఫీస్ట్ అని ఊహించుకున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు కేవలం ఒక పోస్టర్ మాత్రమే ఇస్తారనే న్యూస్ ఫ్యాన్స్ కి డైజెస్ట్ కావట్లేదు. ఇంత హైప్ క్రియేట్ చేసి, తీరా సమయానికి కేవలం టైటిల్ పోస్టర్‌తో సరిపెట్టడం ఏంటoటూ పెదవి విరుస్తున్నారు నెటిజన్లు.
అట్లీ నుండి కేవలం పోస్టర్ మాత్రమేనా?
అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తూ అదిరిపోయే టీజర్
నిజానికి సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే అంచనాలు స్కై లెవల్ లో ఉన్నాయ్.ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ విశ్వరూపం చూపిస్తూ అట్లీ ఒక అదిరిపోయే టీజర్ వదులుతాడని ప్రచారం జోరుగా జరిగింది కూడా. కానీ, ఇప్పుడు కేవలం ఒక టైటిల్ పోస్టర్‌తో మమ అనిపించాలని చూడటం ఫ్యాన్స్‌ను అవమానించడమే అని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని, అవుట్‌పుట్ బాలేదని చెబుతున్న కారణాలు వినడానికి విడ్డూరంగా ఉన్నా… ఇంతభారీ బడ్జెట్ తో సినిమా ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు,కనీసం బర్త్‌డే అప్‌డేట్ కోసం ముందే రెడీ అవ్వరా అంటూ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్. అయితేసైన్స్ ఫిక్షన్ సినిమా అంటే విజువల్స్ ఓ రేంజ్ లో ఉండాలి .ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తారన్నభయంతోనే అట్లీ ఈ ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నాడా అన్న డౌట్స్ వస్తున్నాయ్.
నిరాశలో అల్లు అర్జున్ అభిమానులు
బన్నీ పై అంచనాలు అమాంతం పెంచేసిన పుష్ప2
రిలీజ్ కాకముందే వదిలే అవుట్ పుట్ ఆడియన్స్ కి నచ్చకపోతే కోలుకోవడం కష్టమని మేకర్స్ అనుకోవచ్చు. కానీ అసలు ఎలాంటి వీడియో లేకుండా బన్నీ బర్త్ డే ని కేవలం పోస్టర్స్ తో లాగించి ఫ్యాన్స్ ని కూల్ చేయడం సాధ్యమేనా అంటే అనుమానమే. మరో వైపు బన్నీ గత చిత్రం పుష్ప2 1800 కోట్ల వసూళ్లు సాధించి బన్నీ పై అంచనాలు అమాంతం పెంచేయడంతో దానికి తగ్గ అప్ డేట్ ఇవ్వలేక అట్లీ వెనక్కి తగ్గాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. ఏది ఏమైనా బన్నీ బర్త్ డే రోజు ఎలాంటి వీడియో గ్లిమ్ప్ వదలకుండా పోస్టర్ వదిలి అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకుంటే మాత్రం సినిమా బజ్ పై ఎఫెక్ట్ పడటం పక్కా.చూడాలి మరి ఇప్పటికైనా ఫ్యాన్స్ మోర ఆలకించి సాలిడ్ వీడియో గ్లిప్స్ వదిలి మూవీ లవర్స్ కి ఐ ఫీస్ట్ ఇస్తాడా లేక ఇప్పటికిది సర్దుకొండి అంటూ హ్యాపీ బర్త్ డే పోస్టర్ తో ఉసూరుమనిపిస్తాడా !
మొత్తానికి బన్నీ బర్త్ డేకి అదిరిపోయే అప్‌డేట్ వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. అట్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


