|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు..

Published: 30-09-2025, 8:47 AM
Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు..

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ తన ప్రియుడు మిలింద్ చాంద్వానిని వివాహం చేసుకుంది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ముంబైలో ఘనంగా ఒక్కటైంది. సినీ, వ్యాపార ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

Key Points

1

అవికా గోర్ 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో గుర్తింపు పొంది హీరోయిన్‌గా మారింది.

2

ఆరేళ్లుగా వ్యాపారవేత్త మిలింద్ చాంద్వానితో ప్రేమలో ఉంది.

4

ముంబైలో సినీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు వివాహం ఘనంగా జరుగుతోంది.

అవికా గోర్ సినీ ప్రస్థానం

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న అవికా గోర్ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగులో ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3.. లాంటి పలు సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ లో కూడా పలు సినిమాలు, సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా సినిమాలు చేస్తుంది.(Avika Gor)

అవికా గోర్ ఇటీవల జూన్ లో తన ప్రియుడు మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఆరేళ్లుగా మిలింద్ చాంద్వాని అనే వ్యాపారవేత్తతో అవికా ప్రేమలో ఉంది. ఈ ప్రేమను ఎప్పుడో తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసింది. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి చేసుకుంటున్నారు.

ఆరేళ్ళ ప్రేమ కథ.. నిశ్చితార్థం

నేడు ముంబైలో అవికా గోర్ – మిలింద్ చాంద్వానిల వివాహం ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకకు అనేకమంది సినీ, వ్యాపార ప్రముఖులు హాజరవుతున్నారు. పెళ్లి వేడుకకు వెళ్లేముందు బయట మీడియాకు సెలబ్రిటీలు పోజులు ఇస్తున్నారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ముంబైలో ఘనంగా వివాహం

ఆరేళ్ళ ప్రేమకు పెళ్లితో శుభం కార్డు పడిన అవికా గోర్ – మిలింద్ చాంద్వానిలకు సినీ పరిశ్రమ, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.