|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాహుబలి: ది ఎపిక్ అదుర్స్! ఓటీటీలో అడుగుపెట్టిన అల్టిమేట్ ఎడిషన్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్!

Published: 25-12-2025, 2:15 AM
బాహుబలి: ది ఎపిక్ అదుర్స్! ఓటీటీలో అడుగుపెట్టిన అల్టిమేట్ ఎడిషన్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్!
  • బాహుబలి 1, 2 భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ గా రూపొందించారు.
  • ఈ సినిమా మొత్తం నిడివి మూడు గంటల నలభై నిమిషాలు.
  • నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 25 అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది.
  • రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి సిరీస్ కు సంబంధించిన ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. రాజమౌళి రూపొందించిన ఈ అల్టిమేట్ ఎడిషన్ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. బాహుబలి అభిమానులకు ఇది గొప్ప పండుగే!

బాహుబలి: ది ఎపిక్ – అదొక సంచలనం!

Baahubali: The Epic OTT: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ సినిమా ప్రైడ్ మూవీ బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి 1, బాహుబలి 1 సినిమాలు బాక్సాఫీస్ ను షాక్ చేశాయి. మొదటి భాగం రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా రెండో భాగంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic OTT) పేరుతో ఒకే ప్రాజెక్టుగా రూపొందించాడు దర్శకుడు.

ఓటీటీలో ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

Deepika Pilli: బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి.. నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్.. ఫొటోస్

రాజమౌళి తదుపరి భారీ ప్రాజెక్టు

మూడు గంటల నలభై నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అయితే, బాహుబలి: ది ఎపిక్ ను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 25 అర్దరాత్రి నుంచి ఈ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తంగా, బాహుబలి: ది ఎపిక్ ఓటీటీ విడుదల బాహుబలి అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రాజమౌళి విజన్, అద్భుతమైన కథాంశం ఒకే చోట చూసే అవకాశం నెట్ ఫ్లిక్స్ కల్పించింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమా చూసి ఆస్వాదించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.