|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రోజా గురించి బాలాదిత్య సంచలన కామెంట్స్! షాకింగ్ విషయాలు వైరల్!

Published: 11-03-2026, 2:05 AM
రోజా గురించి బాలాదిత్య సంచలన కామెంట్స్! షాకింగ్ విషయాలు వైరల్!
  • రోజా అక్కతో కలిసి ఆడుకునేవాడినని చెప్పిన బాల ఆదిత్య!
  • రాయుడు గారు నాయుడు గారు సినిమాలో రోజాతో 25 రోజులు కలిసి పనిచేశానని వెల్లడి.
  • రంభ గారి డైలాగ్ నేను చెప్పడంతో ఆమె బాధపడేదని గుర్తు చేసుకున్న బాల ఆదిత్య.
  • చిన్నతనంలో రంభను షూటింగ్ కి తీసుకురావద్దని అమ్మతో కంప్లైంట్ చేసేదట!

బాలాదిత్య గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రోజా గారితో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

రోజాతో బాలాదిత్య అనుభవాలు!

Baladitya : చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన బాలాదిత్య చిన్నప్పుడే చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగా సినిమాలు, సీరియల్స్ చేసాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న బాలాదిత్య ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, హీరోగా సీరియల్స్ చేస్తున్నాడు. తాజాగా బాలాదిత్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక విషయాలు చెప్పాడు.

ఈ క్రమంలో బాలాదిత్య తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన నటీనటుల గురించి చెప్పగా రోజా గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.

రంభతో సరదా సంఘటనలు గుర్తు చేసుకున్న బాలాదిత్య.

బాలాదిత్య మాట్లాడుతూ.. రోజా అక్కతో బాగా ఆడుకునేవాడ్ని. అన్న, రాయుడు గారు నాయుడు గారు సినిమాల్లో రోజా గారితో కలిసి చేశాను. రాయుడు గారు నాయుడు గారు సినిమాకు 25 రోజులు కలిసి పని చేసాము. కాకినాడ దగ్గర యానంలో షూట్. నేను, రోజా అక్క డైలీ కార్ లో వెళ్లి వచ్చేవాళ్ళం. ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. పాటలు, డ్యాన్సులు, ఆటలు అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము అని తెలిపారు.

బాల నటుడిగా బాలాదిత్య సినీ ప్రయాణం.

అలాగే హీరోయిన్ రంభతో కూడా జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. బాలాదిత్య మాట్లాడుతూ.. రంభ రెండో సినిమా తెలుగులో ఏవండీ ఆవిడొచ్చింది. కెరీర్ మొదట్లో కాబట్టి ఆ సినిమాలో రంభ టేక్స్ ఎక్కువ తీసుకునేది. ఓ సారి డైరెక్టర్ ఈవీవీ నన్ను పిలిచి ఆ డైలాగ్ చెప్పి చూపించు అంటే అందరి ముందు రంభ గారు చెప్పాల్సిన డైలాగ్ నేను చెప్పాను. ఆ విషయంలో రంభ గారు బాధపడేది. తర్వాత మా అమ్మ దగరికి వచ్చి వీడ్ని షూటింగ్ కి తీసుకురాకండి అని సరదాగా కంప్లైంట్ ఇచ్చేది నా మీద అని తెలిపాడు.

బాలాదిత్య రోజా, రంభ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.