|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణ బర్త్‌డే సందేశం… కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!

Published: 08-06-2025, 2:15 AM
బాలకృష్ణ బర్త్‌డే సందేశం... కొత్త సీసాలో పాత సారా కలిపాడుగా!

నటుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన లక్ష్మీ నరసింహా సినిమా రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు ఒక కొత్త పాటను జోడించడం విశేషం. ఇది టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.

Key Points

1

బాలకృష్ణ లక్ష్మీ నరసింహా సినిమా 21 ఏళ్ళ తరువాత రీరిలీజ్.

2

సినిమాకు కొత్త పాట జోడించడం విశేషం.

4

కొత్త పాటలోని కొన్ని వాక్యాలు వివాదాస్పదం.

లక్ష్మీ నరసింహా రీరిలీజ్‌కు సిద్ధం

ఆధునిక టెక్నాలజీతో  బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో తీసిన సినిమాలను కలర్‌ లోకి తీసుసుకురావడం,  ఆ తరువాత పాత సినిమాలను 4కెలో లో రీరిలీజ్‌ చేయడం వంటి మార్పుల్ని ఇప్పటికే మనకు పరిచయం చేసిన టాలీవుడ్‌ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. అదే పాత సినిమాలో కొత్త పాటల్ని కలపడం. పాత  విజువల్స్‌కు కొత్త పాటని జత చేసే ట్రెండ్‌ కు నాంది పలికింది సినీనటుడు బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా  సినిమా.

ప్రస్తుతం రీ రిలీజ్‌ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుండడంతో మొత్తం టాలీవుడ్‌ ఫ్లాష్‌ బ్యాక్‌లోకి పరుగులు తీస్తోన్న సంగతి తెలిసిందే. అలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి అప్పట్లో హిట్‌ అయిన చిత్రాల్ని తిరిగి ప్రేక్షకుల ముందుకు తెచ్చే క్రమంలోనే ఇప్పుడు  బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్‌ చేస్తున్నారు. జూన్‌ 8 న ఈ సినిమా రీరిలీజ్‌ కు రెడీ అయ్యింది. బాలకృష్ణ హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. దీనిని నిర్మాత బెల్లంకొండ సురేష్‌  నిర్మించారు. ఈ చిత్రంలో ఆసిన్‌  హీరోయిన్‌ గా నటించింది.   21ఏళ్ల క్రితం 2004 లో రిలీజ్‌ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది.

కొత్త పాటతో ప్రేక్షకులను అలరించనుంది

ఇప్పటివరకు రీరిలీజ్‌ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్‌ ను రూపొందించి విడుదల చేయడం జరుగుతోంది. అయితే  ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త పాటనే రూపొందించారు. మొదట లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్‌ ను రివీల్‌ చేసే సాంగ్‌ ఒకటి రూపొందించారట. అయితే  షూటింగ్‌ కూడా చేసినా ఆ సాంగ్‌ ని వాడలేదట.  దీంతో ఆ  పాత బాలయ్య డ్యాన్స్‌ విజువల్స్‌ను  కొత్తగా పాట రాయించి మరీ ఆ విజువల్స్‌కు జత చేశారట.

తాజాగా ఈ కొత్త సాంగ్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. మంచినీళ్లు తాగినోడు మామూలోడు, మజ్జిగ తాగినోడు మంచోడు.. మందేసినోడు ఘనుడు.. మ్యాన్షన్‌ హౌస్‌ వేసినోడు మహానుభావుడు అంటూ సాగే ఈ పాటనుచంద్రబోస్‌ రాయగా,  స్వరాగ్‌ కీర్తన్‌ ఆలపించగా, భీమ్స్‌ నేపధ్య సంగీతం అందించారు. పాట చివర్లో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ బాలకృష్ణకు యధాశక్తి భజన చేశారు బెల్లంకొండ.

పాత సినిమాలకు కొత్త ట్రెండ్

సినిమా రీరిలీజ్‌ రోజు కలెక్షన్స్‌ కోసం రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు..అలాగే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాత సినిమాకు కొత్త ఆకర్షణలను జోడించడం కూడా తప్పు కాదు. కానీ తాజాగా జోడించిన పాటలో వాక్యాలే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓ వైపు మద్యం ప్రకటనల్లో, ప్రచారాల్లో సినిమా తారలు పాల్గొనడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అలాంటిది ఏకంగా మందు తాగితేనే ఘనుడు, మ్యాన్షన్‌ హౌస్‌  తాగితేనే మహానుభావుడు..వాడిని ఎవడూ ఆపలేడు… అంటూ తన పాటల ద్వారా చెప్పడం అంటే… ఒక ప్రజా ప్రతినిధి యువతకు ఏం సందేశం ఇస్తున్నట్టు? పైగా ఆయన పుట్టిన రోజు నాడు.. అభిమానులకు ఇవ్వాల్సిన సందేశం ఇదేనా?

చివరగా, పాత సినిమాలకు కొత్త ప్రాణం పోసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ ట్రెండ్‌ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. లక్ష్మీ నరసింహా రీరిలీజ్‌ ఎలాంటి స్పందనను పొందుతుందో తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.