
📌 Key Points
- బాలయ్యను డాక్టర్‌గా చూడాలనుకున్న ఎన్టీఆర్, కానీ బాలయ్య మాత్రం నటనపైనే మనసు నిలుపుకున్నాడు.
- ఇంటర్లో బైపీసీ తీసుకున్న బాలయ్య, మెడికల్ ఎంట్రెస్ట్ టెస్ట్ రాసినా.. సినిమాలపై ఉన్న ప్రేమతోనే నటుడిగా మారాడు.
- తండ్రిని ఎదిరించి మరీ సినిమాల్లోకి వచ్చిన బాలయ్య నిర్ణయం ఆయన జీవితాన్నే మార్చేసింది.
- ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు, ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
నందమూరి బాలకృష్ణ గురించి ఒక షాకింగ్ న్యూస్! ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూనే, ఆయననే ఎదిరించి బాలయ్య టాలీవుడ్‌లో ఎలా ఎదిగారో తెలుసా? ఆ రహస్యం ఇప్పుడు బయటపడింది!
బాలయ్యను డాక్టర్‌గా చూడాలనుకున్న ఎన్టీఆర్
విశ్వనట సార్వభౌముడు నందమూరి తారక రామారావు.. సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీ చెట్టుకు బీజం వేశారు. ఆయన నటకాల నుంచి సినిమాల్లోకి వెళ్లారు. అదరగొట్టారు. తెలుగు సినిమా దశదిశని మార్చేశాడు. లెజెండరీ నటుడిగా నిలిచిపోయారు. తెలుగు సినిమా గర్వించే స్థాయికి ఎదగడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఆయన నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారు సినిమాల్లోకి వచ్చారు. ఒక్క బాలయ్య మాత్రమే సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జూ ఎన్టీఆర్, కళ్యాణ్, తారకరత్న వంటి వారు వచ్చారు. తారక్, కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడు మరో తరం హీరోలు రాబోతున్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఆయనంటే వారి పిల్లలందరికీ భయం. ఆయనకు ఎదురెళ్లే సాహసం ఎవరూ చేయరు. ఒక్క హరికృష్ణ తప్ప. ఇప్పుడు తనదైన స్టయిల్‌లో అందరిని భయపెట్టే బాలకృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్‌కి భయపడేవారు. ఈ విషయాన్ని బాలయ్యనే చెప్పారు. ఆయన కూతురు నారా బ్రహ్మాణి కూడా చెప్పారు. కానీ బాలయ్య ఒక్క విషయంలో మాత్రం తండ్రిని ఎదురించాడు. దీంతో ఆయన నిర్ణయం, ఆయన తెగింపు ఇప్పుడు బాలయ్య జీవితాన్నే మార్చేసింది.
సినిమాల కోసం తండ్రిని ఎదిరించిన బాలయ్య
నాన్న రామారావుకి బాలయ్య చిన్నప్పుడు భయపడేవారు. తాను ఏం చేయాలనుకుంటున్నాడో అనే విషయాలు కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో తనకు ఇష్టం లేకపోయినా ఆయన ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నారు. ఎన్టీఆర్‌కి.. బాలయ్యని డాక్టర్‌ని చేయాలని ఉండేది. అందుకే బైపీసీ తీసుకోమని చెబితే, మరో మాట లేకుండా అదే కోర్స్ తీసుకున్నాడు. తర్వాత మెడికల్ ఎంట్రెస్ట్ టెస్ట్ కూడా రాశారు. కానీ రాలేదు. బేసిక్‌గా ఆ చదువుకోవడం, మెడిసిన్ చేయడం బాలయ్యకి ఇష్టం లేదు. సినిమాలు చేయడమే ఇష్టం. దీంతో ఈ విషయంలో తండ్రినే ఎదురించాడు. సినిమాల్లోకి వచ్చాడు. బాలయ్యలో ఉన్న ఉత్సాహం, తపన చూసి రామారావు కూడా ఏం అనలేదట.
టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా బాలకృష్ణ
అలా డాక్టర్ కావాల్సిన బాలకృష్ణ.. యాక్టర్ అయ్యాడు. ఈ విషయాన్ని ఆయన కూతురు నారా బ్రహ్మాణి వెల్లడించారు. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె పంచుకున్నారు. బాలయ్య నిర్ణయం, డేర్ ఆయన జీవితాన్నే మార్చేసింది. టాలీవుడ్‌లో టాప్ స్టార్‌ని చేసింది. కోట్ల మందికి దగ్గర చేసింది. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
బాలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో చూశారుగా. ఆయన సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


