|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలకృష్ణని కోలుకోలేని దెబ్బకొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఈ ఇద్దరికి మైండ్‌ బ్లాక్‌ చేసిన రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌

Published: 22-09-2025, 3:30 AM
బాలకృష్ణని కోలుకోలేని దెబ్బకొట్టిన సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఈ ఇద్దరికి మైండ్‌ బ్లాక్‌ చేసిన రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌

1988 ఫిబ్రవరిలో, బాలకృష్ణ ‘దొంగరాముడు’ మరియు సూపర్ స్టార్ కృష్ణ ‘చుట్టాలబ్బాయి’ సినిమాలు విడుదలయ్యాయి. కానీ వారం తర్వాత విడుదలైన రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ నటించిన ‘స్టేషన్ మాస్టర్’ సినిమా ఈ రెండు సినిమాల భవిష్యత్తును మార్చివేసింది.

Key Points

1

1988లో బాలకృష్ణ 'దొంగరాముడు', కృష్ణ 'చుట్టాలబ్బాయి' సినిమాల విడుదల.

2

రాజశేఖర్, రాజేంద్రప్రసాద్ నటించిన 'స్టేషన్ మాస్టర్' సినిమా రిలీజ్ తో రెండు సినిమాలకు నష్టం.

4

కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'చుట్టాలబ్బాయి' మరియు 'స్టేషన్ మాస్టర్' సినిమాలు విడుదల.

1988 ఫిబ్రవరి: ఒకే వారంలో విడుదలైన మూడు సినిమాలు

సినిమా పరిశ్రమలో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల కావడం, లేదంటే బ్యాక్‌ టూ బ్యాక్‌ పోటీగా రావడం కామన్‌గా జరుగుతుంటుంది. ఇప్పుడు ఒకే రోజు విడుదలైతే పెద్ద నష్టం. కానీ ఒకప్పుడు వారం గ్యాప్‌తో వచ్చినా నష్టమే. అప్పుడు లిమిటెడ్‌ థియేటర్లలో సినిమాలు విడుదలయ్యేవి. ఎక్కువ రోజులు ఆడేవి. అలాంటిది విడుదలైన వారానికే మరో పెద్ద మూవీ విడుదలైతే కచ్చితంగా ముందు సినిమాపై ప్రభావం పడుతుంది. 1988 ఫిబ్రవరిలో అదే జరిగింది. బాలయ్య, సూపర్‌ స్టార్‌ కృష్ణ విషయంలో అదే జరిగింది. ఆ సమయంలో ఈ ఇద్దరిని చావుదెబ్బ కొట్టారు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌. ఆ కథేంటో చూద్దాం.

1988, ఫిబ్రవరి 18న బాలయ్య నటించిన `దొంగరాముడు` విడుదలయ్యింది. దీనికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా పీక్‌లో ఉన్న టైమ్‌లో రాఘవేంద్రరావు నుంచి వచ్చిన చిత్రమిది. ఇందులో బాలయ్యకి జోడీగా రాధ హీరోయిన్‌గా నటించింది. చక్రవర్తి సంగీతం అందించారు.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత క్రమంగా డౌన్‌ అయ్యింది.

‘దొంగరాముడు’ మరియు ‘చుట్టాలబ్బాయి’ సినిమాల బాక్స్ ఆఫీస్ ప్రతిచర్య

ఆ సమయంలోనే వారం గ్యాప్‌తో విడుదలైంది సూపర్‌ స్టార్‌ కృష్ణ `చుట్టాలబ్బాయి`. కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో కృష్ణకి జోడీగా రాధ, సుహాసిని నటించారు. ఈ మూవీకి మిశ్రమస్పందన లభించింది. ఓవరాల్‌గా యావరేజ్‌గా నిలిచింది. అయితే బాలయ్య నటించిన `దొంగరాముడు` కంటే బెటర్‌గా ఉండటంతో ఆడియెన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపించారు. పైగా ఫ్యామిలీ మూవీ కావడంతో లాంగ్‌ రన్‌లో మంచి కలెక్షన్లని సాధించింది. కానీ ఈ మూవీ  దెబ్బకి బాలయ్య `దొంగరాముడు` కుదేలయ్యింది. డిజాస్టర్‌గా నిలిచింది.

‘స్టేషన్ మాస్టర్’ సినిమా ప్రభావం

ఇలాంటి సమయంలో అటు బాలయ్యకి, ఇటు సూపర్‌ స్టార్‌లకు మైండ్‌ బ్లాక్‌ చేసి చావు దెబ్బ కొట్టారు రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌. ఈ ఇద్దరు కలిసి నటించిన `స్టేషన్‌ మాస్టర్‌` మూవీ వారం గ్యాప్‌తో అంటే మార్చి 2న విడుదలైంది. దీనికి కోడి రామకృష్ణనే దర్శకుడు కావడం విశేషం. ఆయన డైరెక్ట్ చేసిన రెండు చిత్రాలు వారం గ్యాప్‌తోనే విడుదల కావడం మరో విశేషం. ఇందులో జీవిత, అశ్వినీ హీరోయిన్లుగా నటించారు. మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన `స్టేషన్‌ మాస్టర్‌` బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. అటు బాలయ్య `దొంగరాముడు`, ఇటు కృష్ణ `చుట్టాలబ్బాయి`కి సాలిడ్‌గా ఝలక్‌ ఇచ్చింది. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. దీంతో యావరేజ్‌గా ఆడాల్సిన `దొంగరాముడు` డిజాస్టర్‌ కాగా, హిట్‌ కావాల్సిన `చుట్టాలబ్బాయి` యావరేజ్‌గా మిగిలిపోయింది. `స్టేషన్‌ మాస్టర్‌` బ్లాక్‌బస్టర్‌ అయ్యింది. కంటెంట్‌ బాగుంటే స్టార్‌ తో సంబంధం లేకుండా సినిమాలు ఆడతాయని నలభై ఏళ్ల క్రితమే నిరూపితమైంది. అప్పటికీ రాజశేఖర్‌ పెద్ద స్టార్‌ కాదు.

చివరికి, రాజశేఖర్ మరియు రాజేంద్రప్రసాద్ నటించిన ‘స్టేషన్ మాస్టర్’ సినిమా అనూహ్యమైన విజయం సాధించి, బాలకృష్ణ మరియు కృష్ణ సినిమాలకు తీవ్రమైన నష్టాన్ని కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.