
📌 Key Points
- బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదకు! గోపీచంద్ మలినేని సినిమాలో మనోజ్ విలన్ గా?
- `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` తర్వాత మళ్లీ కలవనున్న బాలయ్య, మనోజ్! హిట్ కొడతారో లేదో చూడాలి!
- ఎన్బీకే111లో నయనతార హీరోయిన్! గ్యాంగ్‌స్టర్ కథతో ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది
- డేవిడ్ రెడ్డిగా మంచు మనోజ్ నటిస్తున్నారు! స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్ వాళ్ళను ఎదిరించిన డేవిడ్ రెడ్డి కథతో సినిమా!
టాలీవుడ్ లో ఒక సంచలనం! బాలకృష్ణ మరియు మంచు మనోజ్ మరోసారి కలిసి నటించబోతున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ వెనుక ఉన్న అసలు విషయాలు తెలుసుకుందాం!
NBK111లో మంచు మనోజ్?
ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఏ భాషల్లో అయినా మల్టీస్టారర్ చిత్రాలు కామన్‌గానే వస్తున్నాయి. స్టార్ హీరో సినిమాల్లో మరో స్టార్ మెరవడం కామన్ గానే జరుగుతుంది. బలమైన పాత్రలుంటే కాసేపు మెరవడానికి ఎవరైనా రెడీ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ కాబోతుంది. బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటించబోతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ సంగతులేంటో చూద్దాం.
ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ముంబయి బేస్డ్ గా గ్యాంగ్ స్టర్ కథతో ఈ మూవీ సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. నేడు గోపీచంద్ మలినేని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆయనకు విషెస్ కూడా తెలిపింది టీమ్.
గ్యాంగ్‌స్టర్‌గా బాలయ్య అదరగొడతారా?
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో మంచు మనోజ్(ఎంఎం) నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో మనోజ్ నటిస్తున్నట్టు టాక్. అయితే ఆయన ఇటీవల విలన్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నారు. `మిరాయ్` మూవీలో విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య చిత్రంలో కూడా ఆయన విలన్‌గా కనిపిస్తాడని టాక్. కానీ బాలయ్య, మంచు మనోజ్ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త మాత్రం ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్‌లో ఇప్పటికే `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` అనే చిత్రం వచ్చింది. 2012లో ఇది విడుదలైంది. శేఖర్ రాజా దర్శకుడు. ఫాంటసీ యాక్షన కామెడీగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ముఖ్యంగా బాలయ్య, మంచు మనోజ్ పాత్రలు ఆడియెన్స్ కి ఎక్కలేదు. అటు హర్రర్‌లా లేదు, ఇటు హిస్టరిగా లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుందని టాక్. మరి ఇదే నిజమైతే ఈ సారి అయినా హిట్ కొడతారా అనేది చూడాలి.
మళ్ళీ కలిసిన బాలయ్య, మనోజ్!
ప్రస్తుతం మంచు మనోజ్ `డేవిడ్ రెడ్డి` అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అప్పుడు బ్రిటీష్ వాళ్లని ఎదురించిన డేవిడ్ రెడ్డి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు ఈ మూవీ కోసం మంచు మనోజ్ సరికొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నారు. గత మూడు వారాలుగా వర్కౌట్ చేస్తున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి. అలరించాయి.
బాలకృష్ణ, మంచు మనోజ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


