|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య సినిమాలో హాట్ బ్యూటీ దింపుల్ హ‌యాతి.. సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందే!

Published: 28-03-2026, 4:05 PM
బాలయ్య సినిమాలో హాట్ బ్యూటీ దింపుల్ హ‌యాతి.. సెకండ్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందే!
  • బాలయ్య కొత్త సినిమాలో డింపుల్ హయాతి సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ!
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టనున్నాడు!
  • వీర సింహారెడ్డి కాంబినేషన్ రిపీట్.. బాలయ్య, గోపీచంద్ మరో సంచలనానికి సిద్ధం!
  • ముంబై బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ.. నయనతార మెయిన్ హీరోయిన్!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

బాలయ్య సరసన డింపుల్ హయాతి.. ఇది నిజమా?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లో దూసుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య, అటు ప్రజాసేవలో కూడా ముందుంటారు. ముఖ్యంగా సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే నందమూరి బాలకృష్ణ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేస్తున్నారు నందమూరి బాలయ్య. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ తో కొనసాగుతుందని టాక్.

ఇందులో బాలకృష్ణ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపిస్తారని అంటున్నారు. ఇప్పటికే గోపీచంద్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వీర సింహారెడ్డి సినిమా వచ్చి సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో ఇప్పటికే నయనతార మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ కాగా, మరో కొత్త హీరోయిన్ తెరపైకి వచ్చారు. ఇటీవల రవితేజ సినిమాతో మెరిసిన డింపుల్ హయాతి బాలయ్య సినిమాలో రెండో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సినిమా సెకండ్ పార్ట్ లో డింపుల్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబో మళ్ళీ వచ్చేసింది!

ముంబైలో బాలయ్య గ్యాంగ్ స్టర్ అవతారం.. రచ్చ మామూలుగా ఉండదు!

బాలయ్య కొత్త సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. డింపుల్ హయాతి హీరోయిన్ గా ఎంపిక కావడం ఒక సంచలనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.