|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్, థియేటర్లో తాండవమే

Published: 09-12-2025, 12:48 PM
Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్, థియేటర్లో తాండవమే
  • అఖండ 2 సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
  • సినిమా ప్రీమియర్ షోలు డిసెంబర్ 11 నుంచే ప్రారంభం కానున్నాయి.
  • ఆర్థిక లావాదేవీల కారణంగా మొదట సినిమా వాయిదా పడింది.
  • ప్రస్తుతం అన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడంతో రిలీజ్ ఖరారైంది.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆర్థిక లావాదేవీల కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్లు మొదలవుతాయి. థియేటర్లలో సంచలనం సృష్టించడం ఖాయం.

అఖండ 2 వాయిదాకు కారణాలు, పరిష్కారం

Akhanda 2 : బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. ఈపాటికి థియేటర్స్ లో సంచలనం సృష్టించవలసిన ఈ సినిమా చివరి నిమిషంలో ఆర్థిక లావాదేవీలు కారణంగా పోస్ట్ పోన్ అయిపోయింది. కాసేపట్లో ప్రీమియర్లు మొదలవుతాయి అనుకునే టైంలో చాలామంది అభిమానులతో పాటు ప్రేక్షకులకు పోకిరి లెవెల్ ట్విస్ట్ వచ్చింది. గతంలో ఉన్న ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయని సందర్భంగా ఈ సినిమాను వాయిదా వేసినట్లు తేలింది.

అయితే ప్రీమియర్ షోలు మాత్రమే క్యాన్సిల్ అయిపోయాయి. మరుసటి రోజు మామూలుగా షో పడిపోతుంది అని చాలామంది ఊహించారు. కానీ ఒక్కరోజులో అవేవీ కొలిక్కి రాలేదు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పరిస్థితులు అన్నీ కూడా చక్కబడ్డాయి. లోకల్ ఫైనాన్షియర్స్ కు కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేశారు. ఈ తరుణంలో సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పెద్ద సినిమాలకు ఈ మధ్యకాలంలో ముందు రోజు ప్రీమియర్లు పడటం అనేది జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా కూడా డిసెంబర్ 11 నుంచి ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. సినిమా రిలీజ్ అవడం లేట్ ఏమో కానీ ఖచ్చితంగా ఒక సంచలనం క్రియేట్ చేయడం మాత్రం పక్కా అనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. గతంలో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి.

All set for the Divine Destruction at the box office 🔥

రిలీజ్ డేట్, ప్రీమియర్ల తేదీల ప్రకటన

Feel the MASSive power of #Akhanda2 in theatres from 𝐃𝐄𝐂𝐄𝐌𝐁𝐄𝐑 𝟏𝟐 with grand premieres on December 11th 💥🔱

BOOKINGS OPEN SOON! #Akhanda2Thaandavam ‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu … pic.twitter.com/LVmTNIObEr

— 14 Reels Plus (@14ReelsPlus) December 9, 2025

బోయపాటి-బాలకృష్ణ కాంబోపై అంచనాలు

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా విపరీతంగా ఆకట్టుకుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాల్లో కమర్షియల్ రంగులతో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు వీడియో కంటెంట్ చూస్తే అర్థమయిపోతుంది.

ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు తమన్ ఏ రేంజ్ లో సంగీతం అందిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మామూలు సీన్ కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా చేయడం తమన్ మ్యూజిక్ కి ఉన్న స్ట్రెంత్.

మొత్తానికి అఖండ 2 సినిమాకు సంబంధించిన ఆర్థిక సమస్యలు పరిష్కారమై రిలీజ్ డేట్ ఖరారు కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.