
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడింది.
- బాలయ్య తన 111వ చిత్రం (NBK 111) షూటింగ్ పనులలో నిమగ్నమయ్యారు.
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK 111 పీరియాడిక్ సినిమా.
- NBK 111లో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో మహారాజుగా, నయనతార మహారాణిగా కనిపించనున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడింది. దీంతో బాలయ్య తన 111వ చిత్రం ‘NBK 111’ షూటింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
అఖండ 2 విడుదల వాయిదా కారణాలు
Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం అఖండ 2(Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై సరైన స్పష్టత మాత్రం వెలువబడలేదు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరికి డిసెంబర్ 12వ తేదీ లేదా 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఫైనాన్స్ వివాదంలో ఉన్న సమయంలో బాలకృష్ణ పూర్తిగా ఈ సినిమాని పక్కన పెట్టి కొత్త సినిమా పనులలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ ఐదవ తేదీ అఖండ 2 సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలకృష్ణ పూర్తిగా ఈ సినిమా ప్రమోషన్ల పై దృష్టి సారించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడి తిరిగి విడుదల తేదీ పై స్పష్టత లేని నేపథ్యంలో బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమా పనులలో బిజీ కానున్నారు.
NBK 111 పనుల్లో బాలయ్య బిజీ
ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని అయితే బాలకృష్ణ ఈ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా హై వోల్టేజ్ యాక్షన్ సన్ని వేషాలను చేయబోతున్నారు. ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేతృత్వంలో ఈ సన్నివేశం షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నారు.
ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించగా, మహారాణిగా నయనతార కనిపించబోతున్నారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకొని వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఇతర అప్డేట్స్ కూడా వెల్లడించనున్నారు.
NBK 111: పీరియాడిక్ కథ, స్టార్ కాస్ట్ వివరాలు
నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, ‘NBK 111’ షూటింగ్‌పై దృష్టి సారించారు. ఈ పీరియాడిక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.


