|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య జోరు: కుర్ర హీరోలకు సైతం షాక్! వరుస సినిమాలతో దూకుడు!

Published: 03-04-2026, 8:05 AM
బాలయ్య జోరు: కుర్ర హీరోలకు సైతం షాక్! వరుస సినిమాలతో దూకుడు!
  • ఆరు పదుల వయసులో కూడా బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 111వ సినిమా సెట్స్ మీద ఉంది.
  • వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కురుక్షేత్ర అనే సినిమాలో బాలయ్య నటించనున్నారు.
  • విజయ్ కనకమేడల దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా చేయనున్నారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ తన వరుస సినిమాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన స్పీడ్ చూపిస్తున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్య స్పీడ్‌కు టాలీవుడ్ షాక్

Nandamuri Balakrishna: మూడు పదుల్లో ఉన్న కుర్ర హీరోలే ఏడాదికి ఒక సినిమా సరిగ్గా కంప్లీట్ చేయలేకపోతుంటే నట సింహం బాలయ్య మాత్రం ఆరు పదులు దాటినా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలని లైనప్ చేస్తుండటం టాలీవుడ్ లో ఇపుడు హాట్ టాపిక్ అయిపొయింది. మొన్నటి వరకు ఇక సీనియర్స్ చాప చుట్టేయాల్సిందే అంటూ మీడియాలో సెటైర్స్ వేసిన వాళ్ళే ఇపుడు బాలయ్య స్పీడ్ చూసి నోరెళ్ళ బెడుతున్నారు. అఖండ ముందు వరకు కాస్త స్లోగా ఉన్న బాలయ్య అఖండ ఇచ్చిన జోష్ తో ఢాకూ మహారాజ్, వీర సింహ రెడ్డి, అఖండ 2 అంటూ వరుస సినిమాలని చేస్తూ కుర్ర హీరోలకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

గోపీచంద్ మలినేని తో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో

ఇక ఇప్పటికే గోపీచంద్ మలినేని తో అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో తన 111వ సినిమాను సెట్స్ మీద పెట్టేసిన బాలయ్య 2026 దసరా లేదా 2027 సంక్రాంతి.. టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.ఇక మొదటగా అనుకున్న హిస్టారికల్ సబ్జెక్ట్ కాస్తా కమర్షియల్ యాక్షన్ డ్రామాగా మారిన సంగతి తెల్సిందే.ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ కాగా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక పవర్ ఫుల్ రోల్ కోసం రాయ్ లక్ష్మీలలో రాయ్ లక్ష్మి లేదా డింపుల్ హయాతి లో ఒకర్ని కన్ఫాం చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది బట్ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

గోపీచంద్ మలినేనితో బాలయ్య 111వ సినిమా

వివేక్ ఆత్రేయతో దర్శకత్వంలో కురుక్షేత్ర

ఇక మైత్రి మూవీ మేకర్స్ పై వివేక్ ఆత్రేయతో దర్శకత్వంలో కురుక్షేత్ర అనే టైటిల్ తో ఓ క్రేజీ యాక్షన్ ఎంటర్ టైనర్ కి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ .ఇక ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది.అయితే  వివేక్ చెప్పిన కథ చాలా పెద్దగా ఉండటంతో సినిమాని రెండు పార్ట్స్ గా తీస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ రెండు పార్ట్స్ ని కూడా బాలయ్య ఒకేసారి కంప్లీట్ చేయాలని కోరాడంటే బాలయ్య స్పీడ్ ఏ లెవల్లో ఉందొ అర్థం చేసుకోవచ్చు .

సీరియస్ సినిమాల దర్శకుడు విజయ్ కనకమేడల ని కూడా లైన్లో

ఇక వీళ్ళతో పాటు ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి సీరియస్ సినిమాల దర్శకుడు విజయ్ కనకమేడల ని కూడా లైన్లో పెట్టాడట బాలయ్య. హీరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన విజయ్ కనకమేడలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య హరీష్ శంకర్ ని మాత్రం కన్సిడర్ చేయకపోవడం గమనార్హం.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కురుక్షేత్ర

సినిమా తీయాలని ఆశ పడుతున్న వాళ్ళు ..

ఇక వీళ్ళతో పాటు మార్కో డైరెక్టర్ హనీఫ్ అదెని, దండుపాల్యం డైరెక్టర్ శ్రీనివాసరాజు కూడా బాలయ్యతో సినిమా తీయాలని ఆశ పడుతున్న వాళ్ళే. ఏది ఏమైనా బాలయ్య ఇలా వరుస సినిమాలు లైనప్ లో పెడుతున్నాడన్న టాక్ రావడంతో మిగతా హీరోల సినిమాలకి థియేటర్లు దొరకడం కూడా కష్టమే అంటూ చెవులు గొణుక్కుoటున్నాయట ట్రేడ్ సర్కిల్స్.

ఇక అటు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, స్పీడ్ గా కంప్లీట్ అయ్యే సినిమాల్ని కూడా లైనప్ చేస్తున్న బాలయ్య ని చూసి మా హీరో గాడ్ ఆఫ్ మాసెస్ మాత్రమే కాదు ‘కింగ్ ఆఫ్ స్పీడ్’ కూడా అంటూ కాలర్ ఎగరేస్తున్నారట నందమూరి ఫ్యాన్స్.మొత్తానికి అరవైల్లోనూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని బాలయ్య మరోసారి ప్రూవ్ చేస్తున్నాడన్న మాట !

మొత్తానికి బాలయ్య తన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే మరిన్ని సినిమాలు లైన్లో ఉండే అవకాశం ఉంది. బాలయ్య రాబోయే సినిమాల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.