
📌 Key Points
- నటసింహం బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో సింగర్‌గా మారబోతున్నారు.
- సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
- పాట ‘సాహోరే బాహుబలి’ తరహాలో ఉంటుందని తమన్ వెల్లడి.
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోయే పాన్ ఇండియా చిత్రం 2026లో విడుదల.
నందమూరి బాలకృష్ణ త్వరలో సింగర్‌గా మారబోతున్నారనే వార్త అభిమానులను సంతోషానికి గురిచేస్తుంది. తన తదుపరి చిత్రంలో బాలయ్య ఓ పాట పాడతారని సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. ఈ పాట బాహుబలి స్థాయిలో ఉంటుందని ఆయన తెలిపారు. బాలయ్య కొత్త అవతారంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలయ్య సింగర్ అవతారం: తమన్ వెల్లడించిన సంచలనం
Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)తాజాగా అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 12వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా అనంతరం బాలయ్య తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopi Chand Malineni) డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమా పిరియాడికల్ మైథాలజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించగా, మహారాణిగా నయనతార (Nayanatara) నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే.
“బాహుబలి” రేంజ్ సాంగ్ కోసం భారీ ప్లానింగ్
ఈ సినిమా బాలకృష్ణ, తమన్ కాంబినేషన్లో రాబోతున్న ఆరవ సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమా గురించి తాజాగా తమన్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ సింగర్ గా మారబోతున్నారని తెలియజేశారు. స్వయంగా బాలకృష్ణ ఓ పాట కూడా పాడబోతున్నారని ఆ పాట అచ్చం బాహుబలి సినిమాలో దలేర్ మెహందీ పాడిన సాహోరే బాహుబలి అంటూ సాగిపోయే పాట తరహాలో ఉండబోతుందని తమన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా బాలయ్య బాబు సింగర్ గా మారబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా, కూడా ఇండస్ట్రీలో కొనసాగిన బాలకృష్ణ ఈసారి సింగర్ గా మారబోతున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతున్న ఈ సినిమా 2026 లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇదివరకు బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్బికె 111 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
గోపీచంద్ మలినేనితో బాలయ్య తదుపరి చిత్రం
బాలకృష్ణ సింగర్‌గా మారి, బాహుబలి రేంజ్ పాటతో సందడి చేయబోతుండటం సినిమాపై అంచనాలను పెంచింది. గోపీచంద్ మలినేని పాన్ ఇండియా చిత్రానికి ఈ కొత్త ప్రయోగం మరింత బూస్ట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.


