|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్యతో మార్కో డైరెక్టర్ హనీఫ్.. దిల్ రాజు నిర్మాణంలో బాక్సాఫీస్ బద్దలే!

Published: 02-02-2026, 7:05 AM
బాలయ్యతో మార్కో డైరెక్టర్ హనీఫ్.. దిల్ రాజు నిర్మాణంలో బాక్సాఫీస్ బద్దలే!
  • బాలకృష్ణ, హనీఫ్ అదేని కాంబోలో ఊహించని మాస్ యాక్షన్ బొమ్మ ప్లాన్!
  • దిల్ రాజు నిర్మాణంలో బాలయ్య బాబు ఊచకోత ఫిక్స్ అయినట్టే!
  • గోపీచంద్ మలినేని సినిమా తర్వాత మార్కో డైరెక్టర్ తో బాలయ్య సినిమా ప్రారంభం!
  • మార్కో 2 పూర్తయిన వెంటనే బాలకృష్ణతో హనీఫ్ అదేని సినిమా సెట్స్ మీదకు!

నందమూరి బాలకృష్ణ మరో సంచలనానికి సిద్ధమయ్యారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘మార్కో’ సినిమా డైరెక్టర్ హనీఫ్ అదేనితో కలిసి బాలకృష్ణ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనుండటం విశేషం.

బాలయ్య బాబు ఊచకోతకు దిల్ రాజు రెడీ!

Balakrishna: మార్కో.. సినీ ప్రేక్షకులు ఎవరు ఈ సినిమాను మర్చిపోలేరు. మోస్ట్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఈ సినిమాలో చూపించిన ఊచకోతకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మార్కో 2 కూడా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఒక్క సినిమాతో దర్శకుడు హనీఫ్ అదేని ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే, ఈ దర్శకుడు ఇటీవల నందమూరి బాలకృష్ణను కలిశాడట. ఆయనకు ఒక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను వినిపించాడట. ఆ కథ బాలయ్య బాడీ లాన్గ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందట. మార్కో లాగే ఇది కూడా పక్కా మాస్ సబ్జెక్టు కావడంతో బాలకృష్ణ కూడా వెంటనే ఓకే చెప్పేశాడట.

మార్కో డైరెక్టర్ తో బాలకృష్ణ మాస్ మూవీ!

నిజానికి మాస్ అనే పదానికి పెఫెక్ట్ హీరో అంటే బాలయ్య అనే చెప్పాలి. అలాంటి హీరో మార్కో సినిమాలో మాదిరి విలన్స్ మీద పడి ఊచకోత కొస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే, ఈ కథను వెంటనే ఒకే చేశాడట బాలయ్య(Balakrishna). ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించనున్నాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని తర్వాత హనీఫ్ అదేనితో బాలయ్య!

ఇక బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుంచి మొదలుకానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి, ఆ సినిమా విడుదల అయిన తరువాత మార్కో డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు బాలకృష్ణ. ఆలోపు దర్శకుడు హనీఫ్ అదేని మార్కో 2 సినిమాను కంప్లీట్ చేస్తాడు. మరి అసలు ఎవరూ ఊచించని కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.

బాలకృష్ణ, హనీఫ్ అదేని కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.