|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య-కొరటాల కాంబోలో సంచలనం! పవర్ ఫుల్ పోస్టర్ తో మెగా ప్రకటన!

Published: 01-05-2026, 11:34 AM
బాలయ్య-కొరటాల కాంబోలో సంచలనం! పవర్ ఫుల్ పోస్టర్ తో మెగా ప్రకటన!
  • బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో NBK 112 సినిమా అధికారికంగా ఖరారు.
  • “శక్తి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు…” కొటేషన్ తో పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.
  • ఆచార్య నిరాశ తర్వాత కొరటాల శివకు ఇది కీలక ప్రాజెక్ట్.
  • శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మాణం.

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. NBK 112 వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. పవర్ ఫుల్ పోస్టర్ తో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.

కొరటాల శివ కెరీర్ మలుపు

NBK 112 Film: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి నట సింహం బాలకృష్ణ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తలకు తెర దించుతూ చిత్ర నిర్మాతలు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనంతరం జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇలా వరుస సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న కొరటాల శివకు ఆచార్య సినిమా పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కొరటాల కెరియర్ కూడా అయోమయంలో పడింది. ఈ సినిమా అనంతరం ఈయన నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు తన తదుపరి సినిమా ప్రకటించకపోవడంతో అభిమానులు కూడా కొరటాల కెరియర్ పట్ల ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు.

ఇక కొరటాల శివ బాలకృష్ణకు అనుగుణంగా ఒక యాక్షన్ సినిమాని సిద్ధం చేశారని, ఈ కథ బాలకృష్ణకు వినిపించగా బాలయ్య కూడా సానుకూలంగా స్పందించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ఈ సినిమాని ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ పై” శక్తి లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు జన సమూహం ఒక ఉద్యమంగా మారుతుంది.. తారలు అనుకూలించాయి ఒక పండగ వేచి ఉంది” అంటూ ఒక అద్భుతమైన కొటేషన్ తో పోస్టర్ విడుదల చేశారు.

బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్

The Stars Align ✨ A Festival Awaits 💥💥 #NBKxKoratalaSiva ❤‍🔥 #NBK112 pic.twitter.com/jMGI0okz0s

— SLV Cinemas (@SLVCinemasOffl) May 1, 2026

పోస్టర్ లో దాగున్న రహస్యం

ఇక ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా NBK 112 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు అధికారకంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

కొరటాల శివ కెరీర్ కు, బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా మారనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.