|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నెక్ట్స్ మూవీ లైన్‌లో పెట్టిన విజయ్ సేతుపతి.. హీరోయిన్‌గా ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్

Published: 13-11-2025, 5:46 AM
నెక్ట్స్ మూవీ లైన్‌లో పెట్టిన విజయ్ సేతుపతి.. హీరోయిన్‌గా ఆ స్టార్ బ్యూటీ ఫిక్స్

విజయ్ సేతుపతి తన తదుపరి ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నారు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. విలన్ పాత్రకు సంజయ్ దత్‌ను సంప్రదిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ భారీ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'పూరిసేతుపతి' చిత్రంతో బిజీగా ఉన్నారు.

2

తదుపరి ప్రాజెక్టుకు 'విడా ముయార్చి' ఫేమ్ మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించనున్నారు.

4

విలన్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్.

విజయ్ సేతుపతి ప్రెజెంట్ ప్రాజెక్ట్స్

రీసెంట్‌గా ‘సార్.. మేడమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి.. ప్రజెంట్ ‘పూరిసేతుపతి’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జెబి మోషన్ పిక్చర్స్, పూరి జగన్నాథ్ బ్యానర్స్‌పై చార్మీ కౌర్, పూరి జగన్నాథ్, నారాయణ రావు నిర్మిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే, టబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన లెటేస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది.

ఈయన తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ‘విడా ముయార్చి’ ఫేమ్ దర్శకుడు మాగిజ్ తిరుమేనితో జతకట్టడానికి సిద్ధం అయ్యాడట. దీనిని ముంబైకి చెందిన మిరాకిల్ మూవీస్ నిర్మిస్తుందని తెలుస్తుండగా.. విలన్ పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదిస్తున్నారట మేకర్స్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా.. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు హిందీలో ఒకేసారి చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక విజయ్ సేతుపతి, మాగిజ్ తిరుమేని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట మేకర్స్. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. లింక్

నెక్ట్స్ మూవీపై ఆసక్తికర చర్చ

హీరోయిన్, విలన్ ఖరారు?

విజయ్ సేతుపతి, మాగిజ్ తిరుమేని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధా కపూర్, సంజయ్ దత్ వంటి స్టార్స్ భాగం కావడం సినిమాకు మరింత బూస్ట్ ఇస్తుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.