|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య సినిమాపై గుప్పుమంటున్న పుకార్లు: నిజమేనా ఆ సంచలన విషయాలు?

Published: 05-05-2026, 12:01 PM
బాలయ్య సినిమాపై గుప్పుమంటున్న పుకార్లు: నిజమేనా ఆ సంచలన విషయాలు?
  • కొరటాల శివ క్లాస్ స్టైల్ బాలయ్య మాస్ ఇమేజ్‌కి సరిపోతుందా అని అభిమానుల ఆందోళన.
  • దేవర2 ఆలస్యం కావడంతో కొరటాల బాలయ్యతో సినిమా ఓకే చేసుకున్నాడు.
  • తమన్ స్థానంలో దేవి శ్రీ ప్రసాద్ లేదా అనిరుధ్ వచ్చే అవకాశంపై నెగటివ్ బజ్.
  • విద్యా బాలన్, సంజయ్ దత్ కాస్టింగ్ ఎంపికపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన.

బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌పై కొన్ని క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దర్శకుడి స్టైల్, మ్యూజిక్ డైరెక్టర్, నటీనటుల ఎంపికపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

కొరటాల-బాలయ్య కాంబోపై అంచనాలు

Balakrishna Movie : దేవర2 కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన కొరటాల శివ,అది అయ్యేలా లేదని తెలీడంతో బాలయ్యతో సినిమాని ఓకే చేసుకున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు స్కై లెవల్ కి వెళ్ళిపోయాయ్.ముఖ్యంగా అఖండ 2 సినిమా రిజల్ట్ ని అస్సలు పట్టించుకోకుండా వరుస సినిమాలని లైనప్ చేస్తూ దూసుకుపోతుండటంతో మురిసిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.కొరటాల మార్క్ మెసేజ్ కి , బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే రికార్డ్స్ రీరైట్ అయిపోతాయ్ అంటూ ఇప్పటినుండే లెక్కలేసుకుంటున్నారు.అంతవరకు బాగానే ఉంది.

కొరటాల శివ క్లాస్ – బాలయ్య మాస్

కాని కొరటాల శివ స్టైల్ అంటే క్లాస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్. మరి బాలయ్య లాంటి ప్యూర్ మాస్ హీరోను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇక కొరటాల ఇదివరకు చేసిన సినిమాలలా సీన్స్ స్లో గా ఉంటె బాలయ్యకి అస్సలు సూట్ అవదు. బాలయ్య ఎనర్జీని కొరటాల మ్యాచ్ చేయలేకపోతే గనుక ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవడం పక్కా.

మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై సస్పెన్స్

మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నెగటివ్ బజ్

ఈ సంగతి ఇలా ఉంటె మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో నడుస్తున్న సస్పెన్స్ సినిమాపై నెగటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. బాలయ్యకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇస్తున్న తమన్‌ను పక్కన పెట్టి, దేవి శ్రీ ప్రసాద్ లేదా అనిరుధ్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నాడని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.ఈ మధ్య బాలయ్య సినిమా అంటే తమన్ బిజిఎం పక్కా అన్నట్టుగా తయారైంది. అలాంటిది బాలయ్య సినిమాకి తమన్ లేకపోతె సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమన్‌ను కాదని మరెవరికైనా ఛాన్స్ ఇచ్చినా ఆ ఎక్స్పరిమెంట్ తేడా కొడితే మాత్రం సినిమా రిజల్ట్ పై మామూలు ఇంపాక్ట్ ఉండదు .

సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్

నటీనటుల ఎంపికపై మిశ్రమ స్పందన

ఇక ఈ సినిమాలో నటించే యాక్టర్స్ పై కూడా సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయ్.ఇందులో బాలయ్యకి జోడీగా విద్యాబాలన్ పేరు గట్టిగానే వినిపిస్తుంది.నటన పరంగా ఆమె గొప్ప నటే .ఎవరూ వంక పెట్టడానికి లేదు.కానీ బాలయ్య పక్కన విద్యా బాలన్ ఎంతవరకు కమర్షియల్ గా సేల్ అవుతుందన్నది పెద్ద ప్రశ్న. ఇక ఇదే సినిమాలో విలన్ గా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే సౌత్ సినిమాల్లో సంజయ్ దత్ విలనిజం రొటీన్ అయిపోయిందన్న టాక్ ఉంది.అలాంటిది కొరటాల మళ్ళీ సంజుబాబా కే జై కొట్టడం గమనార్హం.అయితే వీటిపై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకున్నా నిప్పు లేనిదే పొగ రాదుగా అంటూ మరిన్ని డిబేట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

మరి ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమాతో కొరటాల తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేక ఆచార్య లాంటి మరో అధ్బుత కళాఖండాన్ని అందిస్తాడా వేచి చూడాల్సిందే !

బాలయ్య-కొరటాల సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నా, ఈ రూమర్స్ మాత్రం అభిమానులను ఆలోచింపజేస్తున్నాయి. సినిమా విడుదలయ్యే వరకు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.