|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్యాండ్ మేళం ట్రైలర్: బావా మరదళ్ల మధ్య ప్రేమ యుద్ధం! రచ్చ మామూలుగా లేదుగా!

Published: 21-03-2026, 5:05 AM
బ్యాండ్ మేళం ట్రైలర్: బావా మరదళ్ల మధ్య ప్రేమ యుద్ధం! రచ్చ మామూలుగా లేదుగా!
  • హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ చిత్రం.
  • ఈ సినిమా మార్చి 26న శ్రీరామనవమికి విడుదల కానుంది.
  • ట్రైలర్ విడుదల.. పల్లెటూరి బావ మరదళ్ల ప్రేమకథ.
  • సాయికుమార్, ముక్కు అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.

హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జివ్యాజి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది పల్లెటూరి బావా మరదళ్ల ప్రేమకథగా ఉండనుంది. మార్చి 26న సినిమా విడుదల కానుంది.

బ్యాండ్ మేళం ట్రైలర్ విడుదల!

Band Melam Trailer:  హర్ష రోషన్ శ్రీదేవి జంటగా సతీష్ జివ్యాజి దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మాణ సాధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బ్యాండ్ మేళం. నిజానికి ఈ సినిమా మార్చి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ట్రైలర్ వీడియో వైరల్ అవుతుంది.

ఈ సినిమా పల్లెటూరులోని బావ మరదలు ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. చిన్నప్పటి నుంచి బావ మరదలుగా పెరిగిన రాజి, గిరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంటుంది. ఎంతో సరదా సరదాగా తిరిగే వీరిద్దరూ ప్రేమలో పడటం ఆ తర్వాత పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడం రాజీ పెళ్లి చేసుకోకపోవడంతో గిరి ఎమోషనల్ అవుతూ కనిపించిన సన్నివేశాలను ట్రైలర్ లో ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం అందమైన పల్లెటూరి బావ మరదలా ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టమవుతుంది.

బావా మరదళ్ల ప్రేమకథ నేపధ్యం

ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ,పాటలు కూడా సినిమా పట్ల కూడా మంచి అంచనాలను పెంచేసాయి. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే కోర్టు తరహాలోనే శ్రీదేవి రోషన్ మరో హిట్ కొట్టబోతున్నారని స్పష్టం అవుతుంది. మరి మార్చి 26వ తేదీ శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాబోతున్న బ్యాండ్ మేళం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా బ్యాండ్ మోగించనుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రలో నటించారు అలాగే కమిడియన్ ముక్కు అవినాష్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

సతీష్ జువ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా పనిచేసారు. కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో కోన కావ్య, శ్రావ్య ఈ సినిమాకు నిర్మాతలుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా మార్చి 13న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైంది. అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని 19వ తేదీ విడుదల కావడంతో శ్రీరామనవమి పండుగను బ్యాండ్ మేళం క్యాచ్ చేసుకున్నారని చెప్పాలి. మరి ఈ సినిమా ద్వారా హర్ష రోషన్ శ్రీదేవి ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో వేచి చూడాలి.

శ్రీరామనవమికి విడుదల కానున్న చిత్రం

బ్యాండ్ మేళం సినిమా మార్చి 26న శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సాయికుమార్, అవినాష్ కీలక పాత్రల్లో నటించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.