|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బండి సంజయ్ కుటుంబంలో తీవ్ర విషాదం: తల్లికి గుండెపోటు, కుమారుడికి బెయిల్ కష్టం!

Published: 15-05-2026, 5:30 PM
బండి సంజయ్ కుటుంబంలో తీవ్ర విషాదం: తల్లికి గుండెపోటు, కుమారుడికి బెయిల్ కష్టం!
  • బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు రావడంతో మెడికవర్ ఆసుపత్రిలో స్టెంట్ వేశారు.
  • ఆమె ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు; బండి సంజయ్ ఢిల్లీ షెడ్యూల్ రద్దు చేసుకున్నారు.
  • కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
  • న్యాయమూర్తి మాధవీ దేవిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఒకవైపు ఆయన తల్లి శకుంతల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా, మరోవైపు కుమారుడు బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ రెండు పరిణామాలు సంజయ్ కుటుంబాన్ని కలవరపెడుతున్నాయి.

బండి సంజయ్ తల్లికి గుండెపోటు: ఆసుపత్రికి తరలింపు

Bandi Bhageerath: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ అగ్రనేత బండి సంజయ్ కుటుంబంలో ఒకేసారి రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో గురువారం (మే 14) విచారణ ప్రారంభమైంది. కోర్టు నెంబర్ 10 లో జస్టిస్ మాధవి దేవితో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. మరోవైపు బండి సంజయ్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతల హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గురువారం (మే 14) రాత్రి ఆమెకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను కరీంనగర్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. శకుంతలను పరీక్షించిన కార్డియాలజిస్టులు ఆమెకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే స్పందించిన మెడికవర్ వైద్యుల బృందం ఆమెకు అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు.

ఢిల్లీ షెడ్యూళ్లను రద్దు చేసుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. రాత్రికి రాత్రే గచ్చిబౌలి మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, తన తల్లి ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు. తల్లికి అందుతున్న వైద్య సేవలను, ఆమె ప్రస్తుత హెల్త్ కండిషన్‌ను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు కుమారుడి కోర్టు కేసు వ్యవహారం, మరోవైపు తల్లికి గుండెపోటు రావడంతో బండి సంజయ్ కుటుంబం తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయింది.

భగీరథ్ తరపున ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో మరోసారి తన వాదనలను గట్టిగా వినిపించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన ఈ ఇంటెరిమ్ ప్రొటెక్షన్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.

కుమారుడు భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె కోర్టు హాల్లోనే ఓపెన్‌గా ప్రస్తావించారు.

న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న కొన్ని కథనాలపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోర్టుల్లో విచారణ జరుగుతున్న తీరును తప్పుదోవ పట్టించేలా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగుతున్న ఈ ప్రచారం సరైనది కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

బండి భగీరథ కేసును హైకోర్టులో ఎవరు విచారిస్తున్నారు?

తెలంగాణ హైకోర్టులోని కోర్టు నెంబర్ 10 లో జస్టిస్ మాధవి దేవితో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.

బండి భగీరథ్ విచారణ సందర్భంగా జడ్జి దేనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు?

న్యాయమూర్తిపై సోషల్ మీడియా దుష్ప్రచారం: హైకోర్టు ఆవేదన

ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియా వేదికల్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారం, తప్పుడు కథనాలపై జస్టిస్ మాధవీ దేవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ తల్లి ఎక్కడ చికిత్స పొందుతున్నారు?

గుండెపోటుకు గురైన బండి సంజయ్ తల్లి శకుంతల ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెకు స్టంట్ వేశారు.

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన ‘డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్’ (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.

హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు.

ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి. Read More

బండి సంజయ్ కుటుంబం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. తల్లి ఆరోగ్యం, కుమారుడి కేసు వ్యవహారం ఒకేసారి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.