|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bandi Saroj Kumar: సందీప్ రాజ్ అమ్మాయిని అలా చూస్తాడు, సరోజ్ కామెంట్స్

Published: 10-12-2025, 9:48 AM
Bandi Saroj Kumar: సందీప్ రాజ్ అమ్మాయిని అలా చూస్తాడు, సరోజ్ కామెంట్స్
  • ‘మోగ్లీ’ సినిమా డిసెంబర్ 12న కాకుండా ఒక రోజు ఆలస్యంగా విడుదల.
  • బండి సరోజ్ కుమార్ ‘నోలన్’ పాత్రలో, 5 ఏళ్ల తర్వాత నటించారు.
  • సరోజ్, సందీప్ రాజ్ హీరోయిన్‌ను చూసే విధానంపై వివాదాస్పద వ్యాఖ్యలు.
  • సందీప్ రాజ్ తన వ్యాఖ్యలను “ఏమీ అర్థం కాక అలా చూస్తాను” అని వివరణ.

‘మోగ్లీ’ సినిమా విడుదల ఆలస్యం, దాని వెనుక ఉన్న ఆసక్తికర కారణాలను తెలుపుతూ, నటుడు బండి సరోజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలో తన పాత్రతో పాటు, దర్శకుడు సందీప్ రాజ్ హీరోయిన్‌ను చూసే విధానంపై సరోజ్ చేసిన కామెంట్స్, సందీప్ వివరణ ఇప్పుడు వార్తల్లో నిలిచాయి.

‘మోగ్లీ’ సినిమా విడుదల ఆలస్యం వెనుక అసలు కారణం

Bandi Saroj Kumar: సందీప్ రాజ్ దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న సినిమా మోగ్లీ. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు అప్పట్లో అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాను ఒకరోజు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు 5వ తారీఖున రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా 12వ తారీకు వాయిదా పడింది కాబట్టి ఈ సినిమా ఒకరోజు లేటుగా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. అయితే 12వ తారీఖున కొన్నిచోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ మొదలవుతాయి అని అధికారకా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు.

ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ నొలాన్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. మామూలుగా బండి సరోజ్ కుమార్ వేరే సినిమాల్లో పాత్రను చేయడానికి ఇష్టపడడు కానీ ఈ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైన దాదాపు 5 సంవత్సరాల నుంచి సందీప్ రాజ్ ఈ పాత్ర కోసం తనను అడుగుతున్నట్లు చెప్పాడు. అయితే ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు చేయను అని తేల్చి చెప్పేసాడట. కానీ ఈ కథను విన్న తర్వాత ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యతను బట్టి చేశాను అని చెప్పాడు.

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. అయితే ప్రమోషన్స్ కి సరోజ్ రావట్లేదు అనే కంప్లైంట్స్ నిత్యము సోషల్ మీడియాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఒక వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సరోజ్.

బండి సరోజ్ కుమార్ పాత్ర, వివాదాస్పద వ్యాఖ్యలు

సరోజ్ మాట్లాడుతూ సినిమాలో నాది నోలన్ క్యారెక్టర్ కానీ రియల్ లైఫ్ లో నోలన్ క్యారెక్టర్ సందీప్ రాజ్. మీరు ఎప్పుడైనా గమనించండి రోషన్ కనకల హీరోయిన్ స్టేజ్ మీద ఉంటుంటే వాళ్ళిద్దరిని అదోరకంగా సందీప్ రాజు చూస్తూ ఉంటాడు. నేను సినిమాలో అచ్చం అలానే చూస్తాను అని చెప్పాడు. దీనికి సందీప్ సమాధానం ఇస్తూ అటువంటిదేమీ లేదు అసలు ఏమీ అర్థం కాక నేను అలా చూస్తూ ఉంటాను అనే క్లారిటీ ఇచ్చి నవ్వుకున్నాడు.

అఖండ సినిమా 12వ తారీఖున వస్తుంది అనుకునే తరుణంలో ఎమోషనల్ అవుతూ సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఆ పోస్ట్ చూసి చాలామంది సింపతి డ్రామాలు మొదలు పెట్టాడు అంటూ కామెంట్ చేశారు. ఇదంతా చేయడానికి కారణం తను ఎయిర్ అనే ఒక సిరీస్ ఈటీవీ విన్ లో ప్రొడ్యూస్ చేయడం.

సందీప్ రాజ్ వివరణ, ‘అఖండ 2’ ప్రభావం

దానిలో ఒక క్యాస్ట్ గురించి అభ్యంతరకరంగా ఉండేలా సీన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి సందీప్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అతనికి ఈ సినిమా 13 న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

మొత్తం మీద, ‘మోగ్లీ’ సినిమా విడుదల ఆలస్యం, బండి సరోజ్ కుమార్ వ్యాఖ్యలు, సందీప్ రాజ్ వివరణ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సంఘటనలు సినిమా ప్రమోషన్లకు కొత్త ఊపునిచ్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.