|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం: రిటర్న్ గిఫ్ట్ ధర షాకింగ్! పెళ్లి వేడుక ఎలా ఉంటుందో ఊహించండి!

Published: 05-05-2026, 12:01 PM
బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం: రిటర్న్ గిఫ్ట్ ధర షాకింగ్! పెళ్లి వేడుక ఎలా ఉంటుందో ఊహించండి!
  • బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది.
  • టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరయ్యారు.
  • అతిథులకు ₹5000 విలువ చేసే బర్గనర్ బిర్యానీ హండి రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
  • ఈ ఖరీదైన బహుమతితో పెళ్లిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన అతిథులకు బండ్ల గణేష్ ఇచ్చిన ₹5000 విలువైన ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ బహుమతి చూసి పెళ్లి వేడుకపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా

Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం ఇటీవల ఎంతో అందంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. గణేష్ కుమార్తె జనని సూర్య తేజల నిశ్చితార్థపు వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరితో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యి కాబోయే వధువు వరూలను ఆశీర్వదించారు. ఇక సూర్య తేజ జనని నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట అతి త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఇక నిశ్చితార్థపు వేడుకను బండ్ల గణేష్ పెళ్లి తరహాలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల అందరిని కూడా ఆహ్వానించారు. వేడుకకు వచ్చిన వారందరికీ బండ్ల గణేష్ ఖరీదైన కాస్ట్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థానికి వెళ్లినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఇచ్చిన రిటన్ గిఫ్ట్స్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి బండ్లన్న ఇచ్చిన ఆ కాస్ట్లీ గిఫ్ట్ ఏంటి? దాని ధర ఎంత అనే విషయానికి వస్తే..

బండ్ల గణేష్ జనని నిశ్చితార్థపు వేడుకకు వెళ్ళినటువంటి అతిథులకు బర్గనర్ అనే ఆస్ట్రియా బ్రాండ్ కి సంబంధించిన బిర్యానీ హండి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఈ రిటర్న్ లో ఒక స్వీట్ బాక్స్ తో పాటు ఒక బ్లౌజ్ పీస్ అలాగే దాదాపు 5 కిలోల బిర్యానీ హండి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇలా ఈ కిచన్ వేర్ దాదాపు 5000 రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ఎంగేజ్మెంట్ కోసమే బండ్ల గణేష్ 5000 రూపాయల విలువ చేసే రిటన్ గిఫ్ట్ ఇచ్చారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

అతిథులకు ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ వివరాలు

పెళ్లి ఏ రేంజ్ లో చేయబోతున్నారు…

?igsh=MXkwZ3oxbzUyaXdqbg%3D%3D

పెళ్లి వేడుకపై అభిమానుల ఆసక్తి

బండ్ల గణేష్ ఎంగేజ్మెంట్ కోసమే ఈ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇక పెళ్లికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? పెళ్లి ఏ రేంజ్ లో చేయబోతున్నారు అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ కు జననితో పాటు మరొక కుమారుడు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక బండ్ల గణేష్ కాబోయే అల్లుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అనంతరం నిర్మాతగా మారి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ఇటీవల మరో కొత్త బ్యానర్ ప్రకటించారు. మరి ఆ బ్యానర్ లో సినిమాలను ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

బండ్ల గణేష్ నిశ్చితార్థానికే ఇంత ఖర్చు చేస్తే, పెళ్లి వేడుకను ఏ స్థాయిలో నిర్వహిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.