|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bandla Ganesh On Mowgli: మోగ్లీ సినిమాకు బండ్లన్న రివ్యూ.. అదే ఎక్కువైందంటూ!

Published: 13-12-2025, 10:08 AM
Bandla Ganesh On Mowgli: మోగ్లీ సినిమాకు బండ్లన్న రివ్యూ.. అదే ఎక్కువైందంటూ!
  • మోగ్లీ సినిమా ప్రీమియర్ తర్వాత బండ్ల గణేష్ తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
  • సినిమాలోని “వైల్డ్ బ్లాక్‌బస్టర్” ట్యాగ్‌పై గణేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
  • రోషన్ కనకాల నటనను ప్రశంసిస్తూ “నటుడు పుట్టాడు” అని పేర్కొన్నారు.
  • దర్శకుడు సందీప్ రాజ్, సంగీత దర్శకుడు కాలభైరవ, హీరోయిన్ సాక్షిని మెచ్చుకున్నారు.

కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ సినిమాపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాలోని కొన్ని అంశాలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూనే, నటీనటులు, దర్శకుడి పనితీరును ప్రశంసించారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బండ్ల గణేష్ మోగ్లీ రివ్యూ: అదే ఎక్కువైందంటూ!

Bandla Ganesh On Mowgli: కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మోగ్లీ(Mowgli). ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ప్రీమియర్లను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమా పట్ల ఎంతో మంది దర్శక నిర్మాతలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) సైతం ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. వైల్డ్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ చూశాక అనుకున్నాను.. పోస్టర్ మాటలే సినిమా వేరేలా ఉంటుందేమో అని కానీ సినిమా చూశాక అర్థమైంది పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని! ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్న కానీ స్క్రీన్ మీద చూసాక అర్థమైంది రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు.. ఇది అతని రెండో సినిమా. ఇక డైరెక్టర్ సందీప్ రాజ్ కథ మాటల్లో సింప్లిసిటీ సీన్స్ లో క్లారిటీ.. బండి సరోజ్ విలనిజం విలన్ కదా అని ఎక్కువ చేయలేదు. అదే ఎక్కువ అయింది.

ఇక హీరోయిన్ గురించి కూడా బండ్ల గణేష్ స్పందిస్తూ సాక్షి అమాయకత్వం సినిమాకు చక్కని బ్యాలెన్స్.. కాలభైరవ మ్యూజిక్ సీన్స్ కి అవసరమైన చోటే వచ్చి పని చేసింది. విశ్వప్రసాద్ గారి సినిమా టేస్ట్ అంటే ఇదే అని మళ్ళీ గుర్తు చేశారు. మొత్తానికి మోగ్లీ సినిమా చూశాక వైల్డ్ అనే మాటకి అర్థం అప్డేట్ అయ్యింది కంగ్రాట్స్ టీమ్ మోగ్లీ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మనం థియేటర్లో నవ్వుతూ బయటకు రావాలి అంటూ ఈయన సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మోగ్లీ చిత్ర బృందంపై గణేష్ ప్రశంసలు

#Mowgli 🔥 “వైల్డ్ బ్లాక్‌బస్టర్” ట్యాగ్ చూశాక అనుకున్నా… పోస్టర్ మాటలే, సినిమా వేరేలా ఉంటుందేమో అని 😜 కానీ సినిమా చూసాక అర్థమైంది ,పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని!

ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్నా… కాని స్క్రీన్ మీద చూసాక అర్థమైంది ,Roshan…

— BANDLA GANESH. (@ganeshbandla) December 13, 2025

వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ట్వీట్

ఇకపోతే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పలు సినిమాల వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఈయన ఇతర హీరోలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా మాట్లాడిన తీరు తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమవుతుంది. సోషల్ మీడియా వేదికగా లేదా పలు సినిమా వేడుకలలో ఈయన మాట్లాడే వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా ఉంటాయని చెప్పాలి. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే నిర్మాతగా స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను చేసిన బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈయన స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాను అంటూ గత కొంతకాలంగా చెబుతున్న ఇప్పటివరకు ఒక్క సినిమాని కూడా ఈయన ప్రకటించకపోవడం గమనార్హం.

మొత్తంగా, బండ్ల గణేష్ మోగ్లీ సినిమాపై ఇచ్చిన సుదీర్ఘమైన, సూటి అయిన రివ్యూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్యాఖ్యలు సినిమా పట్ల ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.