
📌 Key Points
- బండ్ల గణేష్ రీమిక్స్ చేసిన ‘పాయా పాయా’ పాటలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌తో అదరగొట్టారు.
- ఈ పాట సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాలో ఫుడ్ ఫెస్టివల్ సన్నివేశంలో వస్తుంది.
- కమెడియన్ అలీ డీజే ఆపరేటర్‌గా కనిపించి పాటకి మరింత కామెడీని జోడించారు.
- ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాలోని ‘పాయా పాయా’ పాటలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌తో అదరగొట్టారు. ఈ పాటలో అలీ కూడా సందడి చేశారు. ఫిబ్రవరి 12 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్‌తో బండ్ల గణేష్ సందడి
Paya Paya Video Song: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని ఎప్పుడూ ఓపెన్‌గా చూపించే బండ్ల గణేశ్, గతంలో ఓ వేదికపై..ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో భారీగా వైరల్ అయ్యాయి. ఆ డైలాగ్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇప్పుడు అదే డైలాగ్‌ను, అదే పవన్ కళ్యాణ్ మేనరిజంతో బండ్ల గణేశ్ మరోసారి రీమిక్స్ చేసి అభిమానులను అలరించారు. ఆయన నటించిన తాజా ఓటీటీ సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని లోని పాయా పాయా పాటలో ఈ సీన్ కనిపిస్తుంది. ఈ సినిమా ఈటీవీ విన్ లో త్వరలో.. స్ట్రీమింగ్ అవుతోంది.
‘పాయా పాయా’ పాటలో అలీ కామెడీ టైమింగ్
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా పాయా పాయా పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట సినిమాలోని ఫుడ్ ఫెస్టివల్ సన్నివేశంలో వస్తుంది. పాట అంతా సరదాగా, ఉత్సాహంగా సాగుతుంది. ఇందులో బండ్ల గణేశ్ చెప్పే ఫేమస్ డైలాగ్‌ను కొత్తగా రీమిక్స్ చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సీన్ చూసిన పవన్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.
ఈ పాటలో ప్రముఖ కమెడియన్ అలీ డీజే ఆపరేటర్ పాత్రలో కనిపించారు. అలీ కామెడీ టైమింగ్ పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది. బండ్ల గణేశ్ పవన్ స్టైల్ మేనరిజాలు, అలీ కామెడీ కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలిపాయి.
ఫిబ్రవరి 12 నుండి ఈటీవీ విన్‌లో సినిమా స్ట్రీమింగ్
ఈ సినిమాలో శివాజీ.. లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సరదా వినోదంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 12 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పాయా పాయా.. పాటలో బండ్ల గణేశ్ చేసిన ఈ ఫన్ యాక్ట్..పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
మొత్తానికి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరోసారి తన ప్రత్యేకమైన శైలిలో వినోదాన్ని పంచారు. ‘పాయా పాయా’ పాట పవన్ అభిమానులకు ఒక మంచి ట్రీట్‌గా నిలుస్తుంది.


