|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దివ్యవాణి సంచలనం! బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల దుమ్మురేపిన వేడుక!!

Published: 12-03-2026, 11:35 AM
దివ్యవాణి సంచలనం! బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల దుమ్మురేపిన వేడుక!!
  • దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల ప్రదానోత్సవం!
  • హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్.
  • వివిధ రంగాల్లో రాణించిన మహిళలకు పురస్కారాలు అందజేసిన బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల కమిటీ.
  • త్వరలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల వేడుకలు నిర్వహించనున్న దివ్యవాణి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దివ్యవాణి గారు ఒక సంచలనం సృష్టించారు! బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డులతో మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

దివ్యవాణి సరికొత్త అధ్యాయం!

Bapu Bomma-Vishwa Mahila Awards: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాపు బొమ్మగా సుస్థిర స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు దివ్యవాణి చౌదరి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులను గౌరవించేందుకు “బాపు బొమ్మ – విశ్వ మహిళ(Bapu Bomma-Vishwa Mahila Awards)” (2026) అవార్డుల ప్రధానోత్సవాన్ని హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా మెగా బాపు బొమ్మ శ్రీమతి కొణిదెల అంజనీదేవి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యు.ఎస్.ఎ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యు.ఎస్.ఎ) తదితర ప్రముఖ మహిళామణులు పురస్కారాలు అందుకున్నవారిలో ఉన్నారు.

హైదరాబాద్‌లో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో హైదరాబాద్, దసపల్లా హోటల్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, “తెలుగు వన్” అధినేత కంఠంనేని రవిశంకర్, ప్రముఖ నటుడు – రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు.

సినిమా రంగంతోపాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ విశేష సేవలందిస్తున్న దివ్య వాణి… “బాపు బొమ్మ- విశ్వ మహిళ” పేరుతో ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం.. మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవితో శ్రీకారం చుట్టడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించుకోవడం ద్వారా సమాజంలోని సాటి మహిళామణులందరిలో స్ఫూర్తిని రగిలించాలనే వజ్ర సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ దివ్య వాణి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

వివిధ రంగాల మహిళలకు సత్కారం!

తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దివ్యవాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “బాపు బొమ్మ – విశ్వమహిళ అవార్డ్స్” వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా దివ్య వాణి ప్రకటించారు.

బాపు బొమ్మ-విశ్వ మహిళా అవార్డుల వేడుక విజయవంతంగా జరిగింది. దివ్యవాణి గారి ప్రయత్నం అభినందనీయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.