|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ర్యాప్‌ సింగర్‌ జీవిత ఇతివృత్తంతో బాటిల్‌

Published: 11-10-2025, 12:03 AM
ర్యాప్‌ సింగర్‌ జీవిత ఇతివృత్తంతో బాటిల్‌

ఎలైట్‌ టాకీస్‌ పతాకంపై కే.భాస్కరన్‌ నిర్మిస్తున్న ‘బాటిల్‌’ చిత్రం వార్తల్లో నిలిచింది. ర్యాప్‌ సింగర్‌ జీవిత ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ తమిళ చిత్రానికి నారాయణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్భుడన్‌ అర్జున్‌, ఆరాధ్య ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

Key Points

1

'బాటిల్‌' చిత్రం ర్యాప్‌ సింగర్‌ పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతోంది.

2

అన్భుడన్‌ అర్జున్‌, ఆరాధ్య ప్రధాన పాత్రలలో నారాయణన్‌ దర్శకత్వంలో వస్తుంది.

4

'బాటిల్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

‘బాటిల్‌’ చిత్ర నటీనటులు, సాంకేతిక బృందం

ఎలైట్‌ టాకీస్‌ పతాకంపై కే.భాస్కరన్‌ నిర్మిస్తున్న చిత్రం బాటిల్‌. ‘తంగలాన్‌’ ఫేమ్‌ అన్భుడన్‌ అర్జున్‌, ‘గాంధీ కణక్కు’ చిత్రంలో చిన్న వయసు అర్చనగా నటించిన ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారాయణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇటీవల విడుదలైన దండకారణ్యం చిత్రానికి సహాయ రచయితగానూ, దర్శకుడు శక్తివేల్‌ వద్ద కోడైరెక్టర్‌గా పని చేశారు. ఈ మూవీలో దర్శకుడు సుబ్రమణియం శివ, శరవణన్‌ సుబ్బయ్య, గాయత్రి, మునీశ్‌కాంత్‌, సురుళి, ఇడ్లీకొట్టు చిత్రంలో చిన్న వయసు ధనుష్‌గా నటించిన దిహాన్‌, దివ్యశ్రీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ర్యాప్‌ సింగర్‌ జీవితం ఆధారంగా కథ

ఆరు పాటలు దర్శకుడు నారాయణన్‌ మాట్లాడుతూ.. ఒక ర్యాప్‌ గాయకుడి పూర్తి జీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న తొలి తమిళ చిత్రం ఇదే అన్నారు. ఆ గాయకుడు ఎదుర్కొనే సమస్యలతోపాటు ఒక ముఖ్య విషయాన్ని ఈ చిత్రంలో చెప్పబోతున్నట్లు తెలిపా. సరిగ్గా రెండు గంటల పాటు సాగే ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయన్నారు. ఈ చిత్రానికి జీవా సంగీతం, ప్రముఖ చాయాగ్రహకుడు సెళియన్‌ శిష్యుడు యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. బాటిల్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయగా విశేష స్పందన వస్తోందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

‘బాటిల్‌’ ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన

ర్యాప్‌ సింగర్‌ జీవితాన్ని ఆవిష్కరించే ‘బాటిల్‌’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నారాయణన్‌ తనదైన శైలిలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.