|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాక్! భార్య ముందు మొదటి రోజే ఓటమి.. వీడియో వైరల్!

Published: 30-04-2026, 8:26 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ షాక్! భార్య ముందు మొదటి రోజే ఓటమి.. వీడియో వైరల్!
  • బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వివాహం ఏప్రిల్ 29న తిరుమలలో ఘనంగా జరిగింది.
  • పెళ్లి తర్వాత మొదటిసారి అత్తగారింట్లోకి అడుగుపెట్టిన కావ్యా రెడ్డి క్యూట్ వీడియో వైరల్.
  • భార్య కావ్యా రెడ్డి ముందు తడబడిన సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, అభిమానుల ఆనందం.
  • మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు.

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించే చర్చ! తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరోకి సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ వీడియోలో ఏముంది? ఆయన భార్య ముందు ఎందుకు ఓడిపోయారు? పూర్తి వివరాలు మీకోసం!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ విశేషాలు!

టాలీవుడ్ యంగ్ హీరో సాయి శ్రీనివాస్ బెల్లంకొండ తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కావ్యా రెడ్డి అనే అమ్మాయిని ఆధ్యాత్మిక వాతావరణంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్ 29 నైట్ 11:05 గంటలకు వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరు ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుక అనంతరం ఈ కొత్త పెళ్లి జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు, సినీ లవర్స్ సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. సంప్రాదాయాల ప్రకారం పెళ్లి చేసుకుని మొదటిసారి కొత్త కోడలు అత్తింట్లో అడుగు పెట్టినప్పుడు గుమ్మం దగ్గర ఆపి ఆటపట్టించడం ఆనవాయితి. ఇప్పుడు ఇదే ఆనవాయితీకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. గుమ్మం దగ్గర సాయి శ్రీనివాస్ బెల్లంకొండ తన భార్య కావ్యా రెడ్డితో ఉండగా.. వారిని పేర్లు చెప్పమంటారు. ఇక కావ్య మాత్రం ఏ మాత్రం తడబడకుండా ‘నేను కావ్యా బెల్లంకొండ… మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో కలిసి మా అత్త ఇంటికి కొత్తకోడలు గా వచ్చాను’ అని తెలిపింది. అయితే సాయి మాత్రం కాస్త సిగ్గుపడుతూ తడబడతాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి

భార్య ముందు హీరో మొదటి ‘ఓటమి’ వెనుక కథ!

నెట్టింట సంచలనం రేపుతున్న క్యూట్ వీడియో!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యా రెడ్డిల వైవాహిక జీవితం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ, వారి కెరీర్, వ్యక్తిగత జీవితంపై మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.