|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bellamkonda Srinivas: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో

Published: 13-05-2025, 11:06 AM
Bellamkonda Srinivas: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో

తెలుగు సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో కారు నడపడం వల్ల వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో కారు నడిపాడు.

2

జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసు అతన్ని నిలదీశాడు.

4

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాంగ్ రూట్ డ్రైవింగ్ వివాదం

తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చాన్నాళ్లుగా తెరపై కనిపించలేదు. ఇతడి లేటెస్ట్ మూవీ ‘భైరవం’ మే 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఈ హీరో ఇప్పుడు అనుకోని విషయంలో చర్చనీయాంశమయ్యాడు. రాంగ్ రూట్ లో కారు నడపడమే ఇందుకు కారణం.

ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణ

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ దగ్గర రాంగ్ రూట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. సదరు హీరోని నిలదీశాడు. దీంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిర్మాత కొడుకు అయిన సాయి శ్రీనివాస్.. ‘అల్లుడు శ్రీను’ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఇది ఓ మోస్తరు హిట్ అనిపించుకుంది. మధ్య రాక్షసుడు అనే సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఈ రెండు తప్పితే మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం ‘భైరవం’ కాకుండా కిష్కిందపురి, టైసన్ నాయుడు, హైందవ అని మరో మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకొంటున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్

బెల్లంకొండ శ్రీనివాస్ తన ‘భైరవం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడం విశేషం. ఈ వివాదం అతని ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.