|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ అవకాశం రావడం నా అదృష్టం.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్

Published: 11-11-2025, 1:38 PM
కెరీర్ స్టార్టింగ్‌లోనే ఈ అవకాశం రావడం నా అదృష్టం.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన కెరీర్ ప్రారంభంలోనే అద్భుతమైన అవకాశం పొందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘కుమారి’ పాత్ర కోసం ఆమె పడిన కష్టం, దుల్కర్, రానాలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు.

Key Points

1

దుల్కర్ సల్మాన్ 'కాంత' చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.

2

రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు, సినిమా నవంబర్ 14న విడుదల.

4

దుల్కర్, రానాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కెరీర్ ఆరంభంలో అదృష్టంగా భావిస్తున్నారు.

‘కాంత’ సినిమా విశేషాలు

దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో రానా, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిలిమ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యాను. దుల్కర్, రానాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మరింత ఆనందాన్ని ఇచ్చింది. న్యూ కామర్‌కి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టం. ఒక చాలెంజ్‌గా ఈ క్యారెక్టర్‌ని తీసుకున్నాను. కుమారి క్యారెక్టర్‌కి ఏం కావాలో గ్రౌండ్ వర్క్ చేశాను. 1960 టైమ్స్‌ని రీ క్రియేట్ చేయాలి. అది చాలా టఫ్ జాబ్. ఈ సినిమా కోసం పాత తెలుగు తమిళ్ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు సావిత్రి గారి నటన గమనించాను. వాటన్నిటినీ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని కుమారిని కొత్తగా రీక్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారు. కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. షూటింగ్ అంతా చాలా పాజిటివ్‌గా జరిగింది. అందరం ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్ళం. ఇది నేను 2023లో విన్న కథ అప్పటి నుంచి మాకు జర్నీ ఉంది. చాలా మంచి వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్యూర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. ఒక న్యూ కామర్‌కి ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు’ అంటూ చెప్పుకొచ్చింది.

కుమారి పాత్ర కోసం భాగ్యశ్రీ కష్టం

దుల్కర్, రానాతో స్క్రీన్ షేరింగ్

మొత్తం మీద, ‘కాంత’ భాగ్యశ్రీ బోర్సేకి కెరీర్ బ్రేక్‌గా నిలుస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు. ఒక న్యూ కమర్‌కి ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర లభించడం అరుదని, ఇది తన అదృష్టమని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.