|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bhanu Sri : బిగ్ బాస్ టీమ్ వల్ల నేను బాధపడ్డా.. ముందు ఓకే చెప్పి తర్వాత వద్దని..

Published: 16-06-2025, 1:51 AM
Bhanu Sri : బిగ్ బాస్ టీమ్ వల్ల నేను బాధపడ్డా.. ముందు ఓకే చెప్పి తర్వాత వద్దని..

సిరియల్స్ ద్వారా పేరు తెచ్చుకున్న భానుశ్రీ, బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఢీ షోలో మెంటర్ గా అవకాశం దక్కించుకుంది. కానీ అనుకోకుండా ఆమె ఎదుర్కొన్న ఒక సమస్యను ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత ఢీ షోలో మెంటర్ గా చేసింది.

2

కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత బిగ్ బాస్ టీమ్ ఆమెను ఆ షో నుండి వెళ్ళిపోమని కోరింది.

4

ఈ విషయం వల్ల భానుశ్రీ బాధపడిందని ఆమె తెలిపింది.

ఢీ షోలో భానుశ్రీ అనుభవం

Bhanu Sri : సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకొన్న భానుశ్రీ బిగ్ బాస్ లో పాల్గొని బాగా ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొంది భాను. ఆ తర్వాత పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉంది. తాజాగా భానుశ్రీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.

అయితే భానుశ్రీ బిగ్ బాస్ తర్వాత ఢీ షోలో మెంటర్ గా చేసింది కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మధ్యలోనే వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటో భానుశ్రీ ఇంటర్వ్యూలో తెలిపింది.

బిగ్ బాస్ టీమ్ నిర్ణయం

భానుశ్రీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ తర్వాత ఢీ ఆఫర్ వస్తే బిగ్ బాస్ టీమ్ వాళ్లకు చెప్పే చేశా. కానీ అయిదు ఎపిసోడ్స్ అయ్యాక ఫోన్ చేసి మీరు ఆ షో చేయొద్దు అన్నారు. నేను మీకు చెప్తే ఓకే అన్నారని కదా చేస్తున్నాను అని అడిగితే మా రీజన్స్ మాకు ఉన్నాయి, అగ్రిమెంట్ లో మీరు వేరే ఛానల్ షోలు చేయొద్దు అని ఉంది కదా అన్నారు. దాంతో మధ్యలో వెళ్ళిపోయా. నేను డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి ఢీలో ఒక డ్యాన్స్ టీమ్ కి మెంబర్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఇలా మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాను అని తెలిపింది.

భానుశ్రీ ఎమోషనల్ గా మాట్లాడింది

బిగ్ బాస్ టీమ్ నిర్ణయం వల్ల భానుశ్రీ ఎంతో బాధపడినట్లు తెలిసింది. ఆమె డ్యాన్స్ కెరీర్ పట్ల ఉన్న అభిరుచిని, ఢీ షోలో మధ్యలో వైదొలగిన బాధను ఆమె వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.