
📌 Key Points
- పవన్ కళ్యాణ్, భూమిక కాంబోలో ఖుషి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్!
- ఖుషి సినిమాలో 80 శాతం మేకప్ లేకుండానే నటించిన భూమిక.
- కెమెరామెన్ పీసీ శ్రీరామ్ మేకప్ తీసేయమని చెప్పడంతో అప్సెట్ అయిన భూమిక.
- పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన భూమిక.. డిప్యూటీ సీఎంగా అద్భుతమైన జర్నీ అంటూ కామెంట్స్.
పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన ఖుషి సినిమా గురించి ఒక సంచలన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. భూమిక స్వయంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళ్దాం!
ఖుషి సినిమా గురించి భూమిక షాకింగ్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన `ఖుషి` సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇది బాక్సాఫీసుని షేక్ చేసింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2001లో విడుదలై అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసింది. ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది. అప్పట్లో యూత్‌లో విశేషమైన క్రేజ్‌కి కారణమైందీ మూవీ. అదే సమయంలో లవ్ స్టోరీస్ పరంగానూ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో పవన్, భూమిక మధ్య లవ్ ట్రాక్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ భూమిక లేటెస్ట్ గా స్పందించింది. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీ కోసం తాను మేకప్ వాడలేదని తెలిపింది. అంతేకాదు ఓ సందర్భంలో కెమెరామెన్ మేకప్ తీసేయమని చెప్పాడట. మేకప్ వేసుకోనివ్వలేదట. నేను `ఖుషి` సినిమాకి మేకప్ వేసుకోలేదు. సినిమాలో 80 శాతం మేకప్ లేకుండానే కనిపిస్తాను. దియా సీన్‌లో కొంత మేకప్ టచ్ ఇచ్చాను. కానీ పీసీ శ్రీరామ్(కెమెరామెన్) సర్ ఫేస్ వాష్ చేసుకొని రమ్మని చెప్పాడు. దీంతో అది నన్ను కొంత అప్‌సెట్‌కి గురి చేసింది` అని తెలిపింది భూమిక.
మేకప్ లేకుండానే 80 శాతం నటించానన్న భూమిక!
అంతేకాదు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించింది. “ఖుషి` సినిమా నుంచి డిప్యూటీ సీఎంగా ఇదొక అద్భుతమైన జర్నీ, ఇది చాలా స్పెషల్ జర్నీ. ఒక సహనటిగా పవన్ కళ్యాణ్ సర్ విషయంలో చాలా గర్వంగా ఉంది` అని తెలిపింది భూమిక. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన భూమిక!
భూమిక ప్రస్తుతం `యూఫోరియా` అనే చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా భూమిక ఈ విషయాలను పంచుకుంది. భూమిక తెలుగులో చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది. `ఒక్కడు`, `మిస్సమ్మ`, `సింహాద్రి`, `జై చిరంజీవ`, `మాయా బజార్`, `సత్యభామ`, `అమరావతి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇటీవల `ఎంసీఏ` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `సవ్యసాచి`, `రూలర్`, `సీతా రామం` మూవీలో నటించి మెప్పించింది. అందులో భాగంగా ఇప్పుడు `యూఫోరియా`తో అలరించేందుకు వస్తుంది భూమిక.
భూమిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రస్తుతం యూఫోరియా అనే చిత్రంలో నటిస్తోంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


