
📌 Key Points
- బిగ్ బాస్ తెలుగు 9 చివరి వారం సరదా టాస్క్‌లు, కంటెస్టెంట్ల భావోద్వేగాలతో కొనసాగింది.
- ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్, పవన్, సంజనా, తనూజల కామెడీ స్కిట్ ఇంటి సభ్యులను ఆకట్టుకుంది.
- ఇమ్మాన్యుయెల్ సరదాగా కళ్యాణ్ రహస్య క్రష్ పేరు ‘రమ్య’ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
- ఈ సంఘటన కళ్యాణ్, రమ్యల మధ్య ఏదో ఉందనే చర్చకు దారితీసి, మరింత ఉత్కంఠ రేపింది.
బిగ్ బాస్ తెలుగు 9 చివరి వారం ఆద్యంతం నవ్వులు, భావోద్వేగాలతో సాగింది. ఇమ్మాన్యుయెల్ సరదా స్కిట్‌లో భాగంగా కళ్యాణ్‌కి ఉన్న రహస్య క్రష్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఆసక్తికరమైన ఎపిసోడ్ విశేషాలు మీకోసం.
బిగ్ బాస్ 9 చివరి వారం: సరదా ఆటలు, భావోద్వేగాలు
బిగ్ బాస్ తెలుగు 9 చివరి వారం మొత్తం సరదా గేమ్‌లతో టైమ్ పాస్ చేస్తున్నారు. చిన్న చిన్న టాస్క్ లు ఇస్తూ కంటెస్టెంట్లకి కావాల్సిన, ఇష్టమైన ఫుడ్‌ని ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్‌లో కూడా సరదా టాస్క్ లు ఇచ్చారు. వన్స్ మోర్ వన్ లాస్ట్ ఛాన్స్ అంటూ టాస్క్ ఇచ్చారు. ఇందులో డీమాన్ పవన్ విన్ అయ్యారు. ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది డే తనూజ విన్ అయ్యింది. దీంతో ఆమెకి ఇంటి నుంచి ఫోటో వచ్చింది. తన చెల్లి పెళ్లి ఫోటో. అందులో తనని కూడా మెర్జ్ చేయడంతో తనూజ ఎమోషనల్ అయ్యింది.
డీమాన్ పవన్ టాస్క్ లో విన్ అయ్యాక తన భావాలను పంచుకున్నారు. బిగ్ బాస్‌కి థ్యాంక్స్ చెప్పారు. చివరి వారానికి చేరుకోవడం బాధగా ఉందని, అయితే హౌజ్‌ని వదిలి వెళ్లాలని లేదని చెప్పాడు. కాస్త ఎమోషనల్ అయ్యాడు. తన ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. అయితే కొన్ని సార్లుతాను గట్టిగా మాట్లాడలేకపోయానని, అలా మాట్లాడితే హర్ట్ అవుతారని భావించి తాను మాట్లాడలేకపోయానని తెలిపారు పవన్.
ఇమ్మాన్యుయెల్ కామెడీ స్కిట్: కళ్యాణ్ క్రష్ రహస్యం
ఇక ఎక్స్ ట్రా కట్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అందరు కలిసి ఓ స్కిట్ ప్రదర్శించారు. ఇందులో ఇమ్మాన్యుయెల్ అత్తగా, కళ్యాణ్, పవన్ కొడుకులుగా, సంజనా, తనూజ కోడళ్లుగా నటించారు. ఇందులో ఇమ్మూ రెచ్చిపోయాడు. కోడళ్లపై ఫైర్ అయ్యాడు. తనూజని సరిగా పని చేయడం లేదని, ముచ్చట్లు పెడుతున్నావని ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత సంజనాపై కూడా మండిపడ్డాడు. ఇది నాకే అత్తగా ఉంది, నాకు కోడళు ఏంట్రా అంటూ రచ్చ చేశాడు.
అయితే పదే పదే అత్త పిలవడంతో విసుగు చెంది తన ఇంటి నుంచి వెళ్లిపోతానని పోతుంది. దీంతో ఇమ్మాన్యుయెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీకు మంచి అమ్మాయిలు దొరుకుతారు అని చెప్పి నీకు రీతూని ఇచ్చి పెళ్లి చేస్తానని పవన్‌కి చెప్పడం విశేషం. మరోవైపు కళ్యాణ్‌ని ఉద్దేశించి చెబుతూ, నీకు ఎవరు కావాల్రా అని అడిగాడు, ఒకరు పేరు చెప్పాడు. ఆ తర్వాత రమ్య కావాలా? అని చెప్పడంతో కళ్యాణ్ నవ్వులు పూయించారు. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఇమ్మాన్యుయెల్ సరదాగా చెప్పినా, రమ్య పేరు తీసుకురావడం ఆశ్చర్యంగా మారింది. కళ్యాణ్, రమ్యకి మధ్య ఏదో ఉందనే విషయాన్ని ఇమ్మూ చెప్పకనే చెప్పాడు.
రమ్య పేరుతో షాక్‌లో తనూజ?
ఇదిలా ఉంటే రమ్య.. కళ్యాణ్‌పై పలు ఆరోపణలు చేసింది. అమ్మాయి పిచ్చి అనేలా కామెంట్ చేసింది. అది పెద్ద వైరల్‌గా, ట్రోల్‌కి గురయ్యింది. కళ్యాణ్ వ్యక్తత్వాన్నే రాంగ్గా పోట్రే చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె పేరుని ఇమ్మాన్యుయెల్ చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. తెరవెనుక వేరే కథ ఉందా అనే అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే స్కిట్‌లో కళ్యాణ్‌కి జోడీగా తనూజ కనిపించింది. ఆమెని కాదని, రమ్యని తీసుకురానా అంటూ ఇమ్మాన్యుయెల్ చెప్పడం నవ్వులు పూయించింది. అదే సమయంలో కథ వేరే ఉందనిపిస్తోంది.
ఇమ్మాన్యుయెల్ అనుకోకుండా రమ్య పేరు చెప్పడం బిగ్ బాస్ ఇంట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన కళ్యాణ్, రమ్యల మధ్య ఉన్న బంధాన్ని మరింత స్పష్టం చేసింది. ఈ విషయం రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.


