|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss 9 Promo: రీతూ దొంగబుద్ధి.. కార్నర్ చేసిన నాగ్

Published: 22-09-2025, 2:10 AM
Bigg Boss 9 Promo: రీతూ దొంగబుద్ధి.. కార్నర్ చేసిన నాగ్

బిగ్ బాస్ 9 కెప్టెన్సీ టాస్క్ లో రీతూ చౌదరి చేసిన దొంగతనంపై నాగార్జున తీవ్రంగా స్పందించారు. ప్రోమోలో రీతూ చర్యలను బట్టబయలు చేసి, పవన్ కెప్టెన్సీని రద్దు చేశారు. ఈ వారం నామినేషన్స్ ఎవరు?

Key Points

1

బిగ్ బాస్ 9 ప్రోమోలో రీతూ దొంగబుద్ధి బయటపడింది.

2

నాగార్జున రీతూ చర్యలను తీవ్రంగా విమర్శించారు.

4

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు సభ్యులలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ చర్యలు

బిగ్‌బాస్ ఆడియెన్స్ ఎదురుచూసిన ప్రోమో రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ట్రాంగ్ ప్లేయర్లు అయిన భరణి, ఇమ్మాన్యుయేల్‌లని కాదని సంచాలక్ రీతూ.. పవన్ కెప్టెన్ అయ్యేలా చేసింది. ఎప్పుడు వీకెండ్ వస్తుందా? ఎప్పుడు నాగార్జున ఈ విషయం గురించి రీతూని కడిగేస్తాడా అని చూశారు. ఇప్పుడు శనివారం ఎపిసోడ్‌లో అదే జరగబోతుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.

నాగార్జున విమర్శలు మరియు ప్రతిస్పందన

ప్రోమోలో చూపించినట్లు వస్తూవస్తూనే నాగార్జున.. కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు. రీతూ చౌదరి దొంగబుద్ధి చూపించడం, సంచాలక్‌గా ఫేవరిజం చూపించి పవన్ కెప్టెన్ అయ్యేలా చేయడం, దీని గురించి నాగార్జున కౌంటర్స్ వేశారు. అన్యాయంగా భరణిని ఎలిమినేట్ చేయడం, పవన్‌కి కెప్టెన్సీ ఇచ్చేయడం లాంటి విషయాల గురించి అడిగి కడిగిపారేశారు. అలానే రీతూ-పవన్ ముందస్తుగానే మాట్లాడుకుని ఇదంతా చేసినట్లు ఓ వీడియోని హౌస్ అంతా చూపించి రీతూ బండారం బట్టబయలు చేశారు.

నామినేషన్స్ మరియు ఎలిమినేషన్

అలానే తప్పు పద్ధతిలో కెప్టెన్ అయిన పవన్ నుంచి ఆ పవర్ తీసేసుకున్నారు. ఇలా ప్రోమో ఎండ్ అయింది. మరి పవన్ నుంచి తీసుకున్న కెప్టెన్సీ వేరే ఎవరికైనా ఇస్తారా లేదంటే ఈ వారం కెప్టెన్ లేకుండా హౌస్ నడవబోతుందా అనేది చూడాలి. మరోవైపు ఈ వీక్ నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. వీళ్లలో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా, హరీష్, మనీష్, పవన్, ప్రియ ఉన్నారు. గతవారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందో చూడాలి?

చివరిగా, రీతూ చర్యల వల్ల పవన్ కెప్టెన్సీ కోల్పోయాడు. ఈ వారం ఎవరు ఇంటికి వెళ్తారో చూడాలి. బిగ్ బాస్ 9 లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.