
బిగ్‌బాస్ సీజన్ 9 తొమ్మిదో వారం ఉత్కంఠభరితంగా మారింది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ బిగ్‌బాస్ హౌస్‌లో హీట్ పెంచింది. ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరు నామినేట్ అయ్యారు అనే పూర్తి వివరాలు, వారితో పాటు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకుందాం.
Key Points
బిగ్‌బాస్ సీజన్ 9లో దివ్వెల మాధురి ఎలిమినేషన్ తర్వాత 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
9వ వారం టెడ్డీ బేర్ బొమ్మలతో నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది.
భరణి, సంజన, తనూజ, రాము, సాయి, కళ్యాణ్ ఈ వారం నామినేట్ అయ్యారు.
ఇమ్మాన్యుయేల్ వరుసగా రెండో వారం నామినేషన్ల నుంచి సేఫ్ అయ్యాడు.
నామినేషన్ ప్రక్రియ ఎలా సాగింది?
బిగ్‌బాస్ సీజన్-9 దివ్వెల మాధురి వెళ్ళిపోవడంతో హౌస్‌లో ఇంకా 13 మంది ఉన్నారు. ఇక తొమ్మిదోవారం కొనసాగుతున్న ఈ షోలో నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హీట్ పెంచేశారు. టెడ్డీ బేర్ బొమ్మలతో నామినేట్ చేసుకోవాలని హౌస్‌మెట్స్‌కు సూచించాడు. బజర్ మోగగానే వేరేవారి ఫొటో ఉన్న బొమ్మ తీసుకుని సేఫ్ జోన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. అఖరి జోన్‌లో అడుగుపెట్టేవారు.. వారి దగ్గరున్న బొమ్మపై ఎవరి ఫొటో ఉంటుందో వారి నామినేషన్‌లోకి వెళ్తారు. తాజాగా, రిలీజ్ చేసిన ప్రోమోలో.. ముందుగా.. సంజన, రీతూ బొమ్మను పట్టుకుని మాట్లాడుతూ.. నేను సోలో ప్లేయర్‌గా ఉన్నాను.. రీతూకి మాత్రం డిమాన్ పవన్ సపోర్ట్ చేస్తున్నాడని అంటుంది.
అది అందరికీ కనిపిస్తుందని అనడంతో అది విన్న రితూ ఫుల్ ఫైర్ అయిపోతుంది. అందరికీ రిలేషన్స్ ఉన్నట్లుగానే మాకుడా బాండ్ ఉంది అది మీకు తప్పుగా కనిపిస్తే నేనేం చేయలేను అంటుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి, తనూజ నిల్చోగా.. తనూజను సేవ్ చేసి తాను నామినేట్ అవ్వాలనుకుంటున్నట్లు ప్రకటించి కన్నీరు పెట్టుకుంటాడు. దీంతో మిగతా హౌస్‌మెట్స్ ఆయనను ఓదారుస్తారు. ఇక అంతటితో ప్రోమో కంప్లీట్ అవుతుంది. అయితే ఈ వారం నామినేషన్స్‌లె భరణి, సంజన, తనూజ(tanuja), రాము(raamu), సాయి, కళ్యాణ్(kalyan), నామినేట్ అయినట్లు సమాచారం. ఇక పోయిన వారం సేఫ్ అయిన ఇమాన్యుయేల్.. తొమ్మిదో వారం కూడా నామినేషన్స్‌లో లేడు. ఈ వారం ఆరుగురిలో ఎవరు నామినేట్ అవుతారో తెలియాలంటే వారం ఆగాల్సిందే.
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే!
ఇమ్మాన్యుయేల్ మళ్లీ సేఫ్!
బిగ్‌బాస్ 9వ వారం నామినేషన్స్ ఉత్కంఠగా ముగిశాయి. ఇమ్మాన్యుయేల్ సేఫ్ అవ్వగా, ఆరుగురు కంటెస్టెంట్లు ప్రమాదంలో పడ్డారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వారం ఎలిమినేషన్ కోసం వేచి చూద్దాం.


