
📌 Key Points
- బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డీమన్ పవన్ ఇంట విషాదం
- నోటి క్యాన్సర్ తో బాధపడుతూ పవన్ తండ్రి కన్నుమూత
- సోషల్ మీడియా ద్వారా తండ్రి మరణ వార్తను వెల్లడించిన పవన్
- పవన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్న నెటిజన్లు, అభిమానులు
బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించిన డీమన్ పవన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పవన్ తండ్రి మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డీమన్ పవన్ తండ్రి మరణం
బిగ్ బాస్ సీజన్ 9లో స్టార్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న డీమన్ పవన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డీమన్ పవన్ తండ్రి నోటి క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషాద విషయాన్ని పవన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆయన ఒక ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు.డీమన్ పవన్ తండ్రి కొంతకాలంగా నోటి క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో వెల్లడించాడు.
పవన్ ఈ విషయం వెల్లడించిన సమయంలో ఎమోషనల్ అయ్యాడు.. అందరిని ఏడిపించాడు. ఆ సందర్భం ఆడియన్స్ కూడా ఒకింత ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తండ్రి మరణించడంతో పవన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్, అభిమానులు , సెలబ్రిటీలు పవన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. పవన్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయనకు సందేశాలు పంపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
డీమన్ పవన్ బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యుల క్యాటగిరీ నుంచి ఎంపికై అగ్నిపరీక్షలో పాల్గొని హౌస్ లోకి ప్రవేశించాడు. తన ఆటతీరు, ధైర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చివరి వరకు పోటీ కొనసాగించాడు. ఈ సీజన్ లో పవన్ టాప్ 3 వరకు చేరుకుని ప్రత్యేక గుర్తింపు పొందాడు.హౌస్ లో ఉన్న సమయంలో రీతూ చౌదరితో ఆయనకు ఉన్న రిలేషన్ కారణంగా కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి.
సంతాపం తెలుపుతున్న అభిమానులు
అయినప్పటికీ తన ఆటతో ప్రేక్షకులను మెప్పించడంలో పవన్ విజయవంతమయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లో రెండు సార్లు కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫైనల్ దశకు చేరుకున్న సమయంలో డీమన్ పవన్ 15 లక్షల రూపాయల సూట్ కేస్ ఆఫర్ ను తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చాడు.
డీమన్ పవన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


