|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఫైనల్లీ అంటూ నిశ్చితార్థం ఫొటోలు షేర్..

Published: 06-06-2025, 1:23 AM
నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ.. ఫైనల్లీ అంటూ నిశ్చితార్థం ఫొటోలు షేర్..

బిగ్ బాస్ సీజన్ 7 లో కనిపించి పాపులర్ అయిన శుభశ్రీ తన ప్రియుడు అజయ్ మైసూర్ తో నిశ్చితార్థం చేసుకుంది. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఈ సమాచారాన్ని అభిమానులతో పంచుకుంది.

Key Points

1

బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థం చేసుకుంది.

2

ఆమె నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

4

ఇద్దరూ 'మెసెస్టీ ఇన్ లవ్' అనే కవర్ సాంగ్ లో కలిసి పనిచేశారు.

బిగ్ బాస్ శుభశ్రీ ప్రేమకథ

బిగ్‌బాస్ ఫేమ్ శుభశ్రీ(Shubhasree) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సీజన్-7లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి తన క్యూట్ క్యూట్ మాటలతో అక్కడి వారిని పడేసింది. అలాగే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే డైలాగ్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడు కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’(Amigos) మూవీలో ఓ చిన్న రూల్‌లో కనిపించింది. అలా తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే ఈ బ్యూటీకు సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్(Biss Boss) షో ద్వారానే బాగా ఫేమస్ అయింది.

నిశ్చితార్థం ఫోటోలు వైరల్

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత శుభశ్రీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ఈ భామ తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లు అభిమానులకు తెలియజేస్తూ.. ‘ఫైనల్లీ వి ఆర్ ఎంగేజెడ్’ అంటూ నిశ్చితార్థం ఫొటోస్ షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.

అజయ్ మైసూర్ తో శుభశ్రీ వివాహం

కాగా ఈ అమ్మడు చేసుకోబోయే అతని పేరు అజయ్ మైసూర్(Ajay Mysore).. అలియాస్ ఏజే మైసూర్. అతను సినీరంగంలో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు. ఇక శుభ శ్రీ, ఏజే మైసూర్ కలిసి ఇటీవల ‘మెసెస్టీ ఇన్ లవ్’ అనే కవర్ సాంగ్ చేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటలెక్కనున్నారు.

బిగ్ బాస్ షో ద్వారా పేరు తెచ్చుకున్న శుభశ్రీ, నటుడు అజయ్ మైసూర్ తో కలిసి జీవితం పయనం ప్రారంభించనుంది. వారి జంటకు అభిమానుల శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.