|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`బిగ్‌ బాస్‌ తెలుగు 9` గ్రాండ్‌ లాంచ్‌.. కొత్త హౌజ్‌ ఎలా ఉందో చూశారా? ఈ సారి ట్విస్ట్ ఏంటంటే?

Published: 07-09-2025, 11:06 AM
`బిగ్‌ బాస్‌ తెలుగు 9` గ్రాండ్‌ లాంచ్‌.. కొత్త హౌజ్‌ ఎలా ఉందో చూశారా? ఈ సారి ట్విస్ట్ ఏంటంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున అదిరిపోయే ఎంట్రీతో ప్రారంభమైన ఈ సీజన్ లో రెండు హౌజ్ లు, సెలబ్రిటీలు మరియు కామన్ లు పాల్గొంటున్నారు. కొత్త హౌజ్ డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా ప్రారంభం.

2

రెండు హౌజ్‌లు, కామనర్స్ మరియు సెలబ్రిటీలతో ఉత్కంఠ.

4

ఈ సీజన్‌లో ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో తెలియని ఉత్కంఠ.

బిగ్ బాస్ హౌజ్ డిజైన్

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. గత రెండు నెలలుగా ఊరిస్తున్న ఈ షో ఎట్టకేలకు ఆదివారం (సెప్టెంబర్‌ 7) సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. నాగార్జున అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో దాదాపు 15 మందితో ఈ షో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. వీరిలో సెలబ్రిటీ కంటెస్టెంట్లు, కామనర్స్ ఉంటారు. అయితే ఈ సారి రెండు హౌజ్‌లు ఉండబోతున్నాయి. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని ప్రోమోలో వెల్లడించారు. కామనర్స్ ఒక హౌజ్‌లో, సెలబ్రిటీలు మరో హౌజ్‌లో ఉండబోతున్నారని సమాచారం. అదేంటనేది కాసేపట్లో తేలనుంది.

ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ షోలో మెయిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించేది హౌజ్‌. ఎందుకంటే అది చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అదే సమయంలో ప్రతి రూమ్‌, హాల్‌ ఇలా అన్నీ ఒక థీమ్‌తో ఉంటాయి. డిజైన్స్ సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంటాయి. మరి ఈ సారి ఎలా డిజైన్‌ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హౌజ్‌ని చూపించారు. నాగార్జున కళ్లకి గంతలు కట్టుకుని హౌజ్‌లోకి వెళ్లారు. హౌజ్‌ని పరిచయం చేశారు.

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో గార్డెన్‌ ఏరియాని సరికొత్తగా డిజైన్‌ చేశారు. ఇందులోనూ బిగ్‌ బాస్‌ ఐస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. డిజైన్స్ కూడా కొత్తగా ఉన్నాయి.

రెండు హౌజ్ ల ట్విస్ట్

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే వచ్చే హాల్‌ని సరికొత్తగా డిజైన్‌ చేశారు.  ఇది 9వ సీజన్‌ని ప్రతిబింబిచేలా ఉంది.

బిగ్‌ బాస్‌ షోలో ఈ సారి రెండు హౌజ్‌లు ఉన్నాయట. రెండో హౌజ్‌ని ఇందులో చూపిస్తున్నారు. మొదటి హౌజ్‌ ఎంట్రీని, రెండో హౌజ్‌ని సస్పెన్స్‌ లో పెట్టారు. కాసేపట్లో రివీల్‌ చేయనున్నారు. నాగార్జున దీన్ని రివీల్‌ చేస్తారు. అయితే రెండో హౌజ్‌ మాత్రం అదిరిపోయేలా ఉందట.

ఇది బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఓపెన్‌ హాల్‌. అందరు కూర్చొని మాట్లాడుకోవడానికి, అదే సమయంలో వీకెండ్‌లో నాగార్జున వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఉండే హాల్ ఇది.

నాగార్జున ఎంట్రీ

ఇది హౌజ్‌లోని స్టోర్‌ రూమ్‌ అని తెలుస్తోంది. హౌజ్‌ మేట్స్ కోసం ఫుడ్‌, ఇతర వస్తులు అందించే రూమ్‌ అని తెలుస్తోంది.

ఇది కంటెస్టెంట్లు సరదాగా మాట్లాడుకోవడానికి, వెయిటింగ్‌ హాల్‌లా ఉంది.  ఇందులోనుంచి బెడ్‌ రూమ్స్ కి దారి ఉంటుంది.

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇది మెయిన్‌ బెడ్‌ రూమ్‌. కంటెస్టెంట్లు అంతా ఇక్కడే నిద్రిస్తారు. ఇది చాలా విశాలంగా, లావిష్‌గా ఉంది. చాలా రొమాంటిక్‌గానూ డిజైన్‌ చేశారు. ఓవరాల్‌గా ఈ సారి హౌజ్‌ మాత్రం సరికొత్త లుక్‌లో దర్శనమిస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ తెలుగు 9 కొత్త హౌజ్ మరియు రెండు హౌజ్ ల ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగార్జున హోస్ట్ గా ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.