|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Bigg Boss Telugu 9: తనూజ అమాయకత్వాన్ని వాడేసుకున్న కల్యాణ్‌.. మాట మీద నిలబడ్డ శ్రీజ

Published: 11-10-2025, 1:38 AM
Bigg Boss Telugu 9: తనూజ అమాయకత్వాన్ని వాడేసుకున్న కల్యాణ్‌.. మాట మీద నిలబడ్డ శ్రీజ

బిగ్ బాస్ తెలుగు 9 తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. తనూజ అమాయకత్వాన్ని పవన్ కల్యాణ్ తెలివిగా వాడుకోగా, శ్రీజ తన మాటను నిలబెట్టుకుని అతడిని కెప్టెన్‌గా చేసింది. తోటి హౌస్‌మేట్స్ తనూజ ఆట తీరుపై గుసగుసలాడారు. ఈ వారం కెప్టెన్సీలో జరిగిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Key Points

1

పూల్ టాస్క్‌లో తనూజ సహాయంతో కల్యాణ్ సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళాడు.

2

కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీజ తన మాట నిలబెట్టుకుని కల్యాణ్‌ను కెప్టెన్ చేసింది.

4

తనూజ ఆట తీరు, కల్యాణ్‌పై ఆమె నమ్మకంపై తోటి హౌస్‌మేట్స్ చర్చించుకున్నారు.

పూల్ టాస్క్: తనూజ నిర్ణయం, కల్యాణ్ సేఫ్

తనూజ అమాయకత్వం, తింగరితనాన్ని బాగా వాడేసుకున్నాడు పవన్‌ కల్యాణ్‌. అతడిని సేఫ్‌ జోన్‌లో పడేయడంతో పాటు కెప్టెన్‌ అయ్యేందుకు దారులు పరిచింది తనూజ. అదెలాగో నిన్నటి (అక్టోబర్‌ 10వ) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూసేద్దాం..

పూల్‌ టాస్క్‌ కల్యాణ్‌ ( Pawan Kalyan Padala )ను ఎందుకు సేఫ్‌ జోన్‌లోకి పంపించావు, తనకంటే నువ్వే బాగా ఆడావు కదా! అని ఇమ్మాన్యుయేల్‌, దివ్య అడిగారు. అందుకు తనూజ.. మేము జట్టు కట్టేటప్పుడే సేఫ్‌ అవడంలాంటివి వస్తే తనే తీసుకుంటానన్నాడు. అప్పుడే మాటిచ్చాను అని చెప్పడంతో ఇమ్మూ-దివ్య నోరెళ్లబెట్టారు. ఇక డేంజర్‌ జోన్‌లో ఉన్నవారిలో ఒకర్ని సేఫ్‌ జోన్‌కు పంపించేందుకు బిగ్‌బాస్‌ చివరి ఛాన్స్‌గా పూల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో అందరికంటే పవన్‌ బాగా ఆడాడు. ఈ గేమ్‌లో తనూజను దగ్గరుండి గెలిపించిన భరణి ఆమెను భుజాలపై ఎత్తుకుని మురిసిపోయాడు.

కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీజ వ్యూహం

కల్యాణ్‌ను గెలిపించిన శ్రీజ సేఫ్‌ జోన్‌లో ఉన్న ఇమ్మూ, కల్యాణ్‌, రాము, దివ్య, భరణి, తనూజ ( Thanuja Puttaswamy )లకు కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇది చిన్నప్పుడు ఆడుకున్న దాగుడు మూతల ఆట. ఈ ఆటలో చివరకు కల్యాణ్‌, తనూజ మిగిలారు. వీరిలో ఎవరు కెప్టెన్‌ కావాలన్నది డిసైడ్‌ చేయమని డేంజర్‌ జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఇక్కడే శ్రీజ చక్రం తిప్పింది. తనూజకు అందరి సపోర్ట్‌ ఉంది.. కల్యాణ్‌కు లేదు.. అదీఇదీ చెప్పి అతడికి ఎక్కువ సపోర్ట్‌ వచ్చేలా చేసింది. కేవలం, సుమన్‌, సంజన మాత్రమే తనూజకు మద్దతిచ్చారు. మెజారిటీ సపోర్ట్‌ కల్యాణ్‌కు ఉండటంతో అతడు ఈ వారం కెప్టెన్‌గా నిలిచాడు.

కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తున్న తనూజ కెప్టెన్సీ బ్యాండ్‌ దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానన్నాడు. తనను వరస్ట్‌ ప్లేయర్‌ అన్న దివ్యతో బ్యాండ్‌ కట్టించుకుని కాలర్‌ ఎగరేశాడు. అయితే తనూజ ఆట అర్థం కావట్లేదని ఇమ్మూ, భరణి చర్చించుకున్నారు. కల్యాణ్‌ను గుడ్డిగా నమ్మేస్తోంది. సేఫ్‌ అవ్వాల్సిన తను.. డేంజర్‌ జోన్‌కి వెళ్లిందే వాడివల్ల! అయినప్పటికీ తర్వాత మనం తనను డేంజర్‌ జోన్‌ నుంచి బయటకు తీసుకొచ్చాం. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో మళ్లీ వాడ్ని సపోర్ట్‌ చేసింది అని గుసగులాడారు. తనూజ అమాయకత్వం కల్యాణ్‌కు బాగా కలిసొచ్చింది. కల్యాణ్‌ను కెప్టెన్‌ చేస్తానని గతవారం మాటిచ్చిన శ్రీజ.. తన మాట నిలబెట్టుకుంది.

తనూజ ఆట తీరుపై గుసగుసలు

మొత్తంగా, కల్యాణ్ కెప్టెన్సీ వెనుక తనూజ అమాయకత్వం, శ్రీజ మాట నిలబెట్టుకోవడం ప్రధాన కారణాలు. ఈ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ ప్లాన్స్ ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేసింది. ఆట తీరుపై చర్చలు, మలుపులు రానున్న ఎపిసోడ్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.