
తెలుగు బిగ్ బాస్ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎనిమిది సీజన్లు పూర్తయిన తరువాత, తొమ్మిదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దెబ్బజానీతో సహా చాలామంది సెలబ్రిటీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
Key Points
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలోనే ప్రారంభం కానుంది.
దెబ్బజానీతో సహా అనేక మంది సెలబ్రిటీలతో చర్చలు జరుగుతున్నాయి.
ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చు, లేదా ఆగస్టు చివరిలో కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
బిగ్ బాస్ 9 ప్రారంభ తేదీ
ఒకప్పుడు బిగ్‌బాస్ ( Bigg Boss Reality Show ) మ్యూజిక్ వినబడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి టీవీల ముందు కూర్చునేవారు. కానీ, రానురానూ ఆ క్రేజ్ తగ్గిపోతూ వస్తోంది. పేరుకే రియాలిటీ షో కానీ, అంతా స్క్రిప్టెడ్‌లా అనిపిస్తోందని జనం పెదవి విరుస్తున్నారు. పైగా కష్టపడే కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఊహించనివారికి టైటిల్ కట్టబెడుతున్నారన్న కామెంట్లు కూడా వినివిస్తున్నాయి.
ఆ నెలలో షురూ.. ఏమాటకామాట.. ఆ పోట్లాటలు, ఆటలు, సరదాలు, ప్రేమలు.. ఇవన్నీ చూడ్డానికి భలే ఉంటాయని ఈ షో కోసం ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అలాగే తిట్టుకుంటూనే బిగ్‌బాస్ చూసేవాళ్లు కూడా బోలెడుమంది. ఇప్పటివరకు తెలుగులో ఎనిమిది సీజన్లు వచ్చాయి. ఈసారి తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈసారి బిగ్‌బాస్ కాస్త ముందుగా ప్రారంభం కానుందని ప్రచారం జరిగింది.
కంటెస్టెంట్ల ఎంపిక
సంప్రదింపులు- చర్చ దశల్లోనే.. కానీ, సెట్ వర్క్ ఈమధ్యే మొదలైంది. సెట్ రెడీ అయి కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసరికి చాలా సమయమే పడుతుంది. ఈ లెక్కన ఎప్పటిలాగే బిగ్‌బాస్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఆగస్టు చివర్లో స్టార్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బిగ్‌బాస్ 9లోకి రారమ్మని నిర్వాహకులు చాలామందిని సంప్రదిస్తున్నారు.
పార్టిసిపెంట్లు వీళ్లేనా? అందులో.. తేజస్విని, అలేఖ్య (అలేఖ్య చిట్టి పికిల్స్) సిస్టర్స్), బర్రెలక్క, కల్పికా గణేశ్.. ఇలా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కిర్రాక్ బాయ్స్ వర్సెస్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొన్న దెబ్జానీ, శివకుమార్, ఇమ్మాన్యుయేల్ కూడా షోలో ఎంట్రీ ఇచ్చే ఆస్కారం లేకపోలేదు. ఇందులో ఎవరి పేర్లు ఫైనల్ అవుతాయనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే! హోస్ట్‌గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ నాగార్జునే ఈసారి కూడా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
హోస్ట్ నాగార్జున
బిగ్ బాస్ 9 కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది సంతోషకరమైన వార్త. ఎవరు పాల్గొంటారో, ఎలా ఉంటుందో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూద్దాం.


