|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కాల్పులు జరిపింది నేనే అని ఒప్పుకున్న బాలీవుడ్ నటుడు! సంచలన అరెస్ట్!

Published: 24-01-2026, 12:35 AM
షాకింగ్: కాల్పులు జరిపింది నేనే అని ఒప్పుకున్న బాలీవుడ్ నటుడు! సంచలన అరెస్ట్!
  • బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కే ఆర్ కేను పోలీసులు అరెస్టు చేశారు.
  • ముంబైలోని రెసిడెన్షియల్ బిల్డింగ్ పై కాల్పులు జరిపిన కేసులో కే ఆర్ కేను అదుపులోకి తీసుకున్నారు.
  • జనవరి 18న అందేరిలోని ఓషివారాలో ఒక భవనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగాయి.
  • లైసెన్స్ గన్ క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు కాల్పులు జరిపినట్లు కేఆర్కే అంగీకరించాడు.

బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ అలియాస్ కే ఆర్ కే చిక్కుల్లో పడ్డారు. ముంబైలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ పై కాల్పులు జరిపినందుకు అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్పుల ఘటన వివరాలు

Bollywood:ఈమధ్యకాలంలో సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే తప్పిదాల వల్ల ఏకంగా చిక్కుల్లో పడుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక నటుడు తెలియక చేసిన తప్పిదం వల్ల ఏకంగా అరెస్టు చేయబడ్డారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఫిలిం క్రిటిక్స్ కే ఆర్ కే అలియాస్ కమాల్ ఆర్ ఖాన్.

అసలు విషయంలోకి వెళ్తే ముంబైలోని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ పై కాల్పులు జరిగిన ఘటనలోనే ఈ బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు కమాల్ ఆర్ ఖాన్ ఫైరింగ్ చేసిన తుపాకీని కూడా సీజ్ చేశారు. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ సంఘటన జనవరి 18వ తేదీన ఆదివారం రాత్రి జరిగింది. ఆ సమయంలో అందేరీలో ఓషివారాలోని ఒక నివాస భవనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగాయి. నలందా సొసైటీ నుండి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి నలంద అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తు అలాగే మరొకటి నాలుగవ అంతస్తులో ఈ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే రెండవ అంతస్తులో రచయిత – దర్శకుడి ఫ్లాట్ లో ఈ బుల్లెట్ లభించగా.. మరొకటి నాల్గవ అంతస్తులో ఉన్న ఒక మోడల్ ఫ్లాట్ లో ఈ బుల్లెట్ ను దక్కించుకున్నట్లు సమాచారం.

కేఆర్కే అరెస్ట్ కు దారితీసిన పరిస్థితులు

ఇకపోతే ఘటన జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులను సంప్రదించగా.. సంజయ్ చవాన్ నేతృత్వంలోని ఓషివారా పోలీస్ స్టేషన్ నుండి 18 మంది పోలీసుల బృందం, అనేక క్రైమ్ బ్రాంచ్ బృందాలతో కలిసి ఈ కేసును దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఏమీ కనిపించకపోవడంతో పోలీసులకు మొదట్లో ఏమీ అర్థం కాలేదట. కానీ ఫోరెన్సిక్ బృందం సహాయంతో కె ఆర్ కె బంగ్లా నుండి బుల్లెట్లు పేలి ఉండవచ్చని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయనను వెళ్లి అడగగా ఆయన నిజం ఒప్పుకున్నారు

తన లైసెన్స్డ్ గన్నుని క్లీన్ చేశాక.. టెస్ట్ చేసేందుకు ఫోర్ రౌండ్స్ ఫైర్ చేసినట్లుగా కే.ఆర్.కే అంగీకరించారు. ఇక నేరం నిరూపణ కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కమాల్ ఆర్ ఖాన్ నేరం అంగీకారం

కమాల్ ఆర్ ఖాన్ విషయానికి వస్తే.. ఈయన ఫిలిం క్రిటిక్స్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక నటుడు , నిర్మాత, రచయిత, ఇంటర్నెట్ వ్యాఖ్యాతగా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. 1975 జనవరి 1న ఉత్తరప్రదేశ్ లోని డియోబంద్ లో జన్మించిన ఈయన.. 2008లో దేశద్రోహి అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటించారు కూడా.. ఈ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 3 లో 2009లో కనిపించి మరింత పాపులారిటీ అందుకున్నారు. ప్రముఖులపై వ్యక్తిగత దాడులు చేస్తూ అటు చట్టపరమైన వివాదాలను కూడా ఎదుర్కొంటూ ఇబ్బందుల్లో పడుతున్న ఈయన ఇప్పుడు ఏకంగా అరెస్టు చేయబడ్డారు.

ఈ అరెస్ట్ బాలీవుడ్ లో సంచలనంగా మారింది. కేఆర్కే తన చర్యలకు పశ్చాత్తాప పడుతున్నాడా లేదా వేచి చూడాలి. ఈ కేసు విచారణ ఎలా కొనసాగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.