|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అత్యంత భయానకమైన ప్లేస్ అది.. మళ్లీ ఇక్కడికి రావద్దని అనుకున్నాను: రామోజీ ఫిల్మ్ సిటీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి

Published: 18-06-2025, 8:44 AM
అత్యంత భయానకమైన ప్లేస్ అది.. మళ్లీ ఇక్కడికి రావద్దని అనుకున్నాను: రామోజీ ఫిల్మ్ సిటీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ గురించి బాలీవుడ్ నటి కాజోల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వార్తల్లో నిండి ఉన్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె రామోజీ ఫిల్మ్ సిటీని అత్యంత భయానకమైన ప్రదేశంగా అభివర్ణించింది.

Key Points

1

బాలీవుడ్ నటి కాజోల్ రామోజీ ఫిల్మ్ సిటీని అత్యంత భయానకమైన ప్రదేశంగా అభివర్ణించింది.

2

ఆమె 'మా' సినిమా షూటింగ్ సమయంలో అక్కడ చాలా భయపడిందని తెలిపింది.

4

రామోజీ ఫిల్మ్ సిటీలోని కొన్ని ప్రదేశాలు ఆమెకు చాలా భయం కలిగించాయని పేర్కొంది.

కాజోల్ యొక్క భయానక అనుభవం

రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలుసు కదా. హైదరాబాద్ సమీపంలోని ఈ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ సిటీ అందాలను చూసి ఆశ్చర్యపోని వారు ఎవరూ ఉండరు. కానీ అలాంటి ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్లేస్ గా బాలీవుడ్ నటి కాజోల్ అభివర్ణించడం గమనార్హం. అక్కడ షూటింగ్ చేసే సమయంలో తాను చాలా భయంభయంగా ఫీలైనట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

కాజోల్ తన నెక్ట్స్ మూవీ మా (Maa) ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇదొక హారర్ మూవీ. ఇందులో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు చాలా భయం వేసిన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చింది. అలాంటివి చాలా ప్రదేశాలు ఉన్నాయని, అందులో రామోజీ రావ్ స్టూడియోస్ అని చెప్పింది. “చాలాసార్లు అలా జరిగింది. చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాం. షూటింగులు కూడా చేశాం.

రామోజీ ఫిల్మ్ సిటీలోని షూటింగ్

రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడి నుంచి బయటపడితే చాలు అనిపించింది. తిరిగి ఇక్కడికి రాకూడదు అని కూడా అనుకున్నాను. అలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిరావ్ స్టూడియోస్. దీనిని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్రదేశాల్లో ఒకటిగా చెబుతారు. ఒకటి రెండుసార్లు చాలా భయం వేసింది. కానీ భగవంతుని దయ వల్ల అలాంటివి ఏమీ చూడలేదు” అని కాజోల్ చెప్పింది.

కాజోల్, రోనిత్ రాయ్ లాంటి వాళ్లు నటించిన మా మూవీ జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను విశాల్ ఫూరియా డైరెక్ట్ చేశాడు. కాజోల్ భర్త అజయ్ దేవగన్ నిర్మాతల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అతీత శక్తుల నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ తల్లి ఎంత వరకూ వెళ్తుందన్న కథతో తెరకెక్కింది.

‘మా’ సినిమా విశేషాలు

హారర్ జానర్లో కాజోల్ నటించిన తొలి సినిమా ఇదే. ఈ మూవీ షూటింగ్ లో కొంత భాగాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చేశారు. ఈ సందర్భంగానే తనకు చాలా భయం వేసినట్లు కాజోల్ చెప్పింది. ఈ స్టూడియోపై తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది? తనకు జరిగిన అనుభవం ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు.

కాజోల్ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మరో కోణాన్ని చూపించింది. ఆమె భయం, అనుభవాలు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.