
📌 Key Points
- భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంది.
- వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ ఆపరేషన్ కథ వెండితెరపైకి రానుంది.
- రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కే.జే.యస్.టైనీ థిల్లాన్ పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది.
- భారత సైన్యం సాహసోపేత చర్యలను, పహల్గాం ఘటన వెనుక కుట్రలను సినిమాలో చూపించనున్నారు.
బాలీవుడ్లో మరో సంచలన సినిమా రాబోతోంది. భారత సైన్యం పాకిస్థాన్ పై జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ ఆధారంగా వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
‘ఆపరేషన్ సింధూర్’ వెనుక కథ
Bollywood:ఆపరేషన్ సింధూర్.. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ సైన్యం అమాయకపు ప్రజలైన భారతీయులపై అత్యంత దారుణంగా దాడులు చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘాతుకానికి ప్రతీకారం తీర్చుకుంటూ ఇండియా సైన్యం ఆపరేషన్ సింధూర్ అంటూ నిర్వహించి ఉగ్రవాదులను పాతి పెట్టింది. అనవసరంగా ఇండియా జోలికి వస్తే ఇండియా ఏం చేస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ ఆపరేషన్ సింధూర్ ను కథగా తెరపై చూపించడానికి వివాదాస్పద దర్శకుడు సిద్ధం అయిపోయారు. మరి ఆయన ఎవరు? ఈ ఆపరేషన్ సింధూర్ ను కథగా ఎలా తీర్చిదిద్దబోతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం?
ఆయన ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలకు, సక్సెస్ చిత్రాలకి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Ranjan Agnihotri). ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ భారీ ప్రాజెక్టు కోసం చేతులు కలిపారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో ఆపరేషన్ సిందూర్ అనే ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై భారత సైన్యం సాహసోపేతంగా చేపట్టిన కీలక సైనిక చర్యల నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది ..2025లో పహల్గామ్ వేదికగా పర్యాటకులపై జరిగిన ఘోర మారణకాండకు ప్రతీకారంగా భారత ఆర్మీ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాది స్థావరాలపై జరిపిన మెరుపు దాడులను ఈ చిత్రంలో మనకు కళ్ళకు కట్టినట్లు డైరెక్టర్ చూపించనున్నారు.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రయత్నం
సినిమాలో భారత సైన్యం సాహసాలు
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కే.జే.యస్.టైనీ థిల్లాన్ రచించిన ఈ “ఆపరేషన్ సింధూర్ : ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్ సైడ్ పాకిస్థాన్ ” అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఇకపోతే ఈ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో అటు భారత సరిహద్దులు దాటి మన సైనికులు చేసిన వీరోచిత పోరాటం, పహల్గాం ఘటన వెనుక ఉన్న కుట్రలను ఛేదించిన తీరును ఈ సినిమా కథలో ప్రధానంగా చూపించబోతున్నారు మేకర్స్. దేశభక్తిని రగిలించే ఈ యాక్షన్ డ్రామాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, తదితర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. ఇకపోతే ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాలతో వివాదాలతో పాటూ విజయాలను కూడా దక్కించుకున్న డైరెక్టర్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి . ముఖ్యంగా నిజజీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ ఆపరేషన్ సింధూర్ కచ్చితంగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి ఆయన విజువలైజేషన్ తెరపై ఏవిధంగా కనిపిస్తుందో చూడాలి.
భారత సైన్యం సత్తా చాటిన ‘ఆపరేషన్ సింధూర్’ కథ సినిమాగా వస్తుండటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.


